TDP : బాబు ఈజ్ బ్యాక్.. వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటన!

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇక ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణా రూపోందిస్తున్నట్టు చెప్పక తప్పదు.

  • Written By:
  • Updated On - November 23, 2021 / 01:13 PM IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అసెంబ్లీ ఘటన తర్వాత నేడు ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. వరదలు, వర్షాలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

నేరుగా బాధితులతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు ముందుకు కదులుతున్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం కడప, మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. మరోసటిరోజు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు టూర్ ఉంటుందని టీడీపీ వర్గాలు ప్రకటించాయి.

కడప జిల్లా రాజంపేట మండలం తోగూరుపేట గ్రామంలో ముందుగా చంద్రబాబు పర్యటించి, అక్కడి బాధితులను పరామర్శిస్తాడు. 12 గంటలకు మందపల్లె, 12.25 కు పులపుత్తూరు, 12.45 కు గుండ్లూరు పర్యటిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల తరువాత రోడ్డు మార్గంలో చిత్తూరు జిల్లాలో బాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి అర్భన్ ఏరియాలోని ఆటోనగర్ లో వరదతో దెబ్బతిన్న ప్రాంతాల్లో బాబు పర్యటిస్తారు. సాయంత్రం 4 గంటలకు లక్ష్మీపురం సర్కిల్, 4.30 కు మత్యాలరెడ్డి పల్లె వంటి పలు ప్రాంతాలను చుట్టి, రాత్రికి రేణిగుంటలోని వై -కన్వెన్షన్ హాలుకు చేరుకుని రాత్రికి బస చేస్తారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.