Site icon HashtagU Telugu

Chandrababu : వాలంటీర్లకు చంద్రబాబు బంపర్ ఆఫర్

Chandrababu

Chandrababu

ఏపీ (AP)లో వాలంటీర్లకు (Volunteers) చంద్రబాబు (Chandrababu) గుడ్ న్యూస్ తెలిపారు. నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదన వచ్చేలా వారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా శిక్షణ ఇస్తామని తెలిపి వారిలో ఆనందం నింపారు. ఏపీలో వైసీపీ వాలంటీరి వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కేవలం నెలకు రూ.5 వేలు ఇస్తూ వారి చేత ఎన్నో పనులు చేయించుకుంటున్నారు. ప్రభుత్వ పనులే కాక పార్టీ ప్రచార పనులు కూడా చేయిస్తుంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత బాబు..వారికీ గుడ్ న్యూస్ అందజేశారు. గత రెండు రోజులుగా కుప్పంలో బాబు పర్యటిస్తూ వరుసగా ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాము అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో మెగా DSC (Mega DSC) నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కుప్పంలో యువతతో ముఖాముఖిలో పాల్గొన్న ఆయన.. ఏ రంగంలో కూడా అడ్డదారిలో విజయాలు రావు.. లక్ష్య సాధనకు అనునిత్యం కృషి చేయాలని పేర్కొన్నారు. ద్రవిడ విశ్యవిద్యాలయంలో తొలగించిన కోర్సులను పునరుద్దరిస్తాం.. కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. మద్యానికి బానిసలైన వారిని విముక్తి చేయడానికి మండలానికో సైకాలజిస్ట్ ను నియమిస్తామని అన్నారు.

అలాగే వాలంటీర్లు నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదన వచ్చేలా వారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా శిక్షణ ఇచ్చి, వారి జీవితాలు మారుస్తామన్నారు. వారు నీతి, నిజాయితీగా ఉండాలని . వైసీపీ చెప్పిన పనులు చేస్తే మాత్రం జైలుకెళ్తారని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు. మండల కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు నిర్మిస్తామని , భవిష్యత్తులో ఇంటి నుంచే పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. ఏపీని కాాపాడుకునేందుకు పొత్తులు పెట్టుకున్నామని , టీడీపీ, జనసేన , బీజేపీ అందుకే కలిశాయన్నారు. జెండాలు వేరైనా.. అజెండా మాత్రం ఒక్కటేనని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

Read Also : MLC Kavitha : కవితను జైలు వ్యాన్‌లోనే తీహార్ జైలుకు తరలించారు..

Exit mobile version