AP : బండారు సత్యనారాయణ కు టికెట్ ఇచ్చేందుకు బాబు ఫిక్స్ ..?

మాడుగుల అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న సత్యనారాయణను అక్కడి నుంచి బరిలోకి దించాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం

  • Written By:
  • Publish Date - April 17, 2024 / 06:37 PM IST

ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఈసారి జగన్ (Jagan) ను గద్దె దించడమే లక్ష్యంగా చేసుకున్న టీడీపీ, జనసేన (TDP-Janasena) పార్టీలు..బిజెపి ని కలుపుకొని కూటమి గా ఏర్పడ్డాయి. మూడు పార్టీలు కలిసి బరిలోకి దిగుతుండడం తో చాల ప్రాంతాలలో సొంత పార్టీ నేతలకు టికెట్స్ ఇవ్వలేకపోయారు. దీంతో వారంతా అలిగి కూర్చున్నారు. కొంతమంది పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్లగా..మరికొంతమంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ (bandaru satyanarayana) ఒకరు. ఈయన ముందు నుండి పెందుర్తి సీటు ఫై కర్చీఫ్ వేసుకొని కూర్చున్నారు. కానీ పొత్తులో భాగంగా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించారు.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో బండారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు సైతం ఆయన దూరంగా ఉంటున్నారు. బండారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం పార్టీ ఫై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆయన పోటీ చేయాలనుకున్న స్థానంలోనే కాదు పక్క నియోజకవర్గాల్లో కూడా ఆ ప్రభావం పడుతుంది. దీంతో రెండు రోజుల క్రితం విశాఖ పర్యటనలో బండారును సముదాయించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అయినా.. బండారు వెనక్కి తగ్గలేదు. ఇలాగైతే ఇబ్బంది తప్పదని భావించిన చంద్రబాబు..మాడుగుల అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న సత్యనారాయణను అక్కడి నుంచి బరిలోకి దించాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ టికెట్ ను పైలా ప్రసాద్‌ (Pyala Prasad)కు టీడీపీ కేటాయించింది. అక్కడ అసమ్మతి కారణంగా ఆయనను తప్పించి బండారుకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరో ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటె రేపటి నుండి ఏపీలో నామినేషన్ల పర్వం మొదలుకాబోతుంది.

ఈ నెల 19న కుప్పంలో చంద్రబాబు నామినేషన్ వేయనున్నారు. చంద్రబాబు తరఫున ఆయన భార్య భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే నారా లోకేశ్ మంగళగిరిలో రేపు నామినేషన్ వేయనున్నారు. ఉదయం శ్రీసీతారాముల ఆలయం నుంచి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ సమర్పించనున్నారు. ఇక రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురందీశ్వరి ఈ నెల 19న నామినేషన్ వేయనున్నారు.

Read Also : Motkupalli Deeksha : కాంగ్రెస్ పార్టీ తీరుకు నిరసనగా మోత్కుపల్లి దీక్ష..?