Site icon HashtagU Telugu

AP : జగన్‌ ఫొటో ఉన్న పాసుపుస్తకాన్ని చించిపడేసిన చంద్రబాబు

Babuap Land Titling Act

Babuap Land Titling Act

ఏపీ(AP) లో రాజకీయ పార్టీల ప్రచారం పిక్ స్టేజ్ లో నడుస్తుంది. ముఖ్యంగా కూటమి అభ్యర్థులు జగన్ తీసుకొచ్చిన భూహక్కు చట్టం (AP Land Titling Act) ఫై మాట్లాడుతూ ప్రజల్లో భయం పెంచుతూ వస్తున్నారు. జగన్ తెచ్చిన భూహక్కు చట్టం ఇంకా అమల్లోకి రానప్పటికీ.. అది అమల్లోకి వస్తే ఏం జరుగుతుందన్న దానిపై విపక్షాలు గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ చట్టం ఫై ప్రజల్లో కాస్త ఆందోళన ఉంది. ఇప్పుడు ఆ ఆందోళలను మరింత పెంచుతూ కూటమి క్యాష్ చేసుకుంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

వైసీపీ సర్కార్ (YCP) మళ్లీ గెలిస్తే మీ భూములు వదులుకోవాల్సిందే అని..మీ భూములకు మీరు కాదు యజమానులు..జగన్ యజమాని అవుతాడని..మీ పాసుపుస్తకాన్ని తీసుకోని ఎక్కడికి వెళ్లిన రూపాయి ముట్టదని, పేరుకు ఆ పుస్తకంలో మీ ఉంటుంది కానీ దానికి అసలు యజమాని జగన్ అవుతాడని చెపుతూ వస్తుంది. ప్రజలు సైతం బాగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఇప్పటికే వారి పాస్ పుస్తకం ఫై వారి ఫోటోలకు బదులు జగన్ ఫోటో ఉంది..తమ హద్దురాళ్ల ఫై కూడా జగన్ పేరుతో ఉండడంతో కూటమి అభ్యర్థులు చెప్పేది నిజమే అని నమ్ముతున్నారు.

తాజాగా దర్శి లో ప్రచారం చేసిన బాబు..పట్టాదారు పాసుపుస్తకంపై జగన్‌ ఫొటో ఎందుకంటూ జగన్‌ ఫొటో ఉన్న పాసుపుస్తకాన్ని చించిపారేశారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం తెచ్చి ప్రజల మెడలకు జగన్‌ ఉరితాడు బిగించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పట్టాదారు పాసుపుస్తకంపై జగన్‌ ఫొటో ఎందుకు అని, జగన్‌ ఫొటో ఉన్న పాసుపుస్తకాన్ని చించిపారేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజల భూములను జగన్‌ దగ్గర పెట్టుకుంటారంటా, ప్రజల భూమి రికార్డులను ప్రైవేటు సంస్థకు ఇచ్చారని ఆరోపించారు. ప్రజల భూమి జగన్‌ గుప్పిట్లో ఉందన్న చంద్రబాబు, మీ భూమిపై మీకు హక్కు ఉందా అని ప్రశ్నించారు. భూమి మీది అని, పెత్తనం జగన్ ది అని విమర్శించారు. జగన్ అందరి మెడలకు ఉరితాడు వేశారన్న చంద్రబాబు, జగన్‌ ఎప్పుడు లాగితే అప్పుడు మీ ప్రాణం పోతుందని అన్నారు. మీ భూమిని మీకు ఇప్పించే బాధ్యత తనదని చంద్రబాబు తెలిపారు.

Read Also : Delhi : ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌ ఎన్ బ్లాక్‌లో బ్యాగు కలకలం