B K Parthasarathi : పెనుకొండ మాజీ ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్ ఆఫర్ ఇచ్చిన బాబు..?

టీడీపీ లో సీట్ల రగడ తారాస్థాయికి చేరుకుంటుంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ ఈసారి జనసేన తో పొత్తు పెట్టుకొని రంగంలోకి దిగబోతుంది. ఈ క్రమంలో శనివారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 94 స్థానాల్లో టీడీపీ , 24 స్థానాల్లో జనసేన పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమములో కొన్ని స్థానాలలో మార్పులు చేసారు. టీడీపీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు , జనసేన పోటీ చేయాలనుకున్న స్థానాన్లో టీడీపీ అభ్యర్థులు బరిలోకి దిగబోతున్నారు. […]

Published By: HashtagU Telugu Desk
B K Parthasarathi

B K Parthasarathi

టీడీపీ లో సీట్ల రగడ తారాస్థాయికి చేరుకుంటుంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ ఈసారి జనసేన తో పొత్తు పెట్టుకొని రంగంలోకి దిగబోతుంది. ఈ క్రమంలో శనివారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 94 స్థానాల్లో టీడీపీ , 24 స్థానాల్లో జనసేన పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమములో కొన్ని స్థానాలలో మార్పులు చేసారు. టీడీపీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు , జనసేన పోటీ చేయాలనుకున్న స్థానాన్లో టీడీపీ అభ్యర్థులు బరిలోకి దిగబోతున్నారు. దీంతో ఇరు పార్టీల్లో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. ముఖ్యంగా జనసేన పార్టీ లో అసమ్మతి సెగ తారాస్థాయికి చేరుకోవడమే కాదు వరుస పెట్టి నేతలు , పార్టీ శ్రేణులు పార్టీ కి రాజీనామా చేసి వైసీపీ లో చేరుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో ఇరుపార్టీల అధినేతలు టికెట్ దక్కని నేతలతో మాట్లాడుతూ వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా బీకే పార్థసారథి..బాబు ను కలవడం జరిగింది. ఈయన పెనుకొండ టికెట్ ఆశించగా..అది దక్కకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. దీంతో ఈరోజు ఆయన తో మాట్లాడిన బాబు. ఆయనను అనంతపురం లోక్సభ నుంచి పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. మరోపక్క కర్నూలు జిల్లా కోడుమూరులో టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ప్రభాకర్ ఆత్మహత్యాయత్నం చేశారు. పార్టీ టికెట్ తనకు రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై పురుగులమందు తాగారు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చంద్రబాబు తమకు న్యాయం చేయాలని ప్రభాకర్ భార్య కన్నీరు పెట్టుకున్నారు.

Read Also : Jagan Kuppam : కుప్పం వైసీపీ అభ్యర్ధికి భారీ ఆఫర్ ప్రకటించిన జగన్..

  Last Updated: 26 Feb 2024, 07:47 PM IST