Ayyannapatrudu : అయ్యన్నపాత్రుడికి కీలక పదవి ..?

పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి కీలక పదవి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి. ఆయన్ను ఏపీ స్పీకర్‌గా నియమించేందుకు చంద్రబాబు సిద్దమైనట్లు సమాచారం

  • Written By:
  • Publish Date - June 17, 2024 / 12:23 PM IST

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీ..ప్రభుత్వం ఏర్పాటు చేయడం..మంత్రులకు శాఖలు కేటాయించడం, వారు తమ పనిలో బిజీ అవ్వడం ఇలా చకచకా జరిగిపోయాయి. ఇదే తరుణంలో మంత్రి పదవులు దక్కని నేతలకు కీలక పదవులు అప్పగిస్తూ వారిని సంతృప్తి పరుస్తున్నారు చంద్రబాబు. ఈ తరుణంలో పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి (Ayyannapatrudu ) కీలక పదవి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి. ఆయన్ను ఏపీ స్పీకర్‌గా నియమించేందుకు చంద్రబాబు సిద్దమైనట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన జనసేనకు డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వాలని చంద్రబాబు (Chandrababu) నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మండలి బుద్ధప్రసాద్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌, లోకం మాధవి పేర్ల చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఒకరిని డిప్యూటీ స్పీకర్‌ పదవి వరించే అవకాశం ఉందని అంటున్నారు. ఎక్కువ శాతం నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి (Lokam Madhavi) పేరు వినిపిస్తుంది. సామాజిక సమీకరణాలతో పాటుగా మహిళకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని భావిస్తున్నారట. లోకం మాధవి జనసేన నుంచి గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే.. అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గం. ఇప్పటికే కేబినెట్‌‌లో జనసేన నుంచి ఇద్దరు కాపు, ఒక కమ్మ ఉన్నారు. దీంతో లోకం నాగ మాధవి అయితే బావుంటుందని ఆలోచన చేస్తున్నారట. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Read Also : MLA Virupakshi : ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పార్టీ మారేందుకు సిద్దమయ్యారా..?