Site icon HashtagU Telugu

TDP- Janasena Alliance : జనసేనతో పొత్తు లోక కల్యాణం కోసమే – అయ్యన్న

Ayyana Tdp Janasena

Ayyana Tdp Janasena

చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తర్వాత ఏపీ రాజకీయాలు (AP Politics) ఒక్కసారిగా మారిపోయాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు కోసం ముందుండి నిలబడడం..చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించడం..అంతే కాదు రాబోయే ఎన్నికల్లో టీడీపీ తో కలిసి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించడం ఇవన్నీ కూడా టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ – జనసేన శ్రేణులు రోడ్ల పైకి వచ్చి నిరసనలు , ఆందోళనలు తెలుపుతున్నారు. అయితే వీరి ఆందోళనలు ఎక్కడిక్కడే పోలీసులు అడ్డుకుంటున్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం అంటి అని వారంతా ప్రశ్నించారు.

ఇదే క్రమంలో పోలీసుల తీరుపై టీడీపీ సీనియర్ నేత అయన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయం లో పూర్తిగా సపోర్ట్ చేశామని.. పోలీస్ బందోబస్తు సరిగ్గా ఉండాలని.. రోడ్లను రిపేర్ చేయాలని చంద్రబాబు చెప్పేవారన్నారు. హౌజ్ అరెస్టు ఎందుకు చేస్తున్నరు అంటే సమాధానం లేదని.. హౌజ్ అరెస్ట్ చేసే ముందు నోటీస్ ఇవ్వాలి ఈ విషయము పోలీస్ అధికారులకి తెలియదా అని ప్రశ్నించారు. మేము సంఘ విద్రోహ శక్తులమా.. ప్రభుత్వము అంటే ప్రజలు కదా అని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. రోడ్ మీద ధర్నా చేయకూడదా… గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుప కూడదా పోలీసులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. దొంగ కి కాపలా కాస్తున్నారు… ప్రజలకు కాపలా కాయండని పోలీసులను హెచ్చరించారు. పార్టీ కోసం నేను చావడానికి సిధ్ధమని అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. కార్య కర్తలు నిలబెట్టుకున్న పార్టీ టీడీపీ అన్నారు. లోకేష్, చంద్ర బాబు నాయుడు కి ప్రజా ఆదరణ పెరుగుతుంది అని మాత్రమే అరెస్ట్ చేశారని.. లోకేష్ ను ఎయిర్ పోర్టులోనే అరెస్టు చేయడానికి ఏర్పాట్లు చేశారని.. ఆయన కూడా రెడీ అయ్యారన్నారు. అలాగే జనసేనతో పొత్తు (TDP- Janasena Alliance) లోక కల్యాణం కోసమన్నారు. రావణాసురుడి కి రాజకీయ సమాధి కట్టాల్సి ఉందని అయ్యన్న చెప్పుకొచ్చారు.

Read Also : Chandrababu Verdict: చంద్రబాబు కస్టడీ తీర్పు సా. 4 గంటలకు