Open Letter to CJI: సుప్రీం చీఫ్ జ‌స్టిస్ కు ఆయేషా మీరా త‌ల్లి బ‌హిరంగ లేఖ‌…14 ఏళ్లు గ‌డిచినా న్యాయం ద‌క్క‌దా.. !

బెజ‌వాడ‌లో సంచ‌ల‌నం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో అస‌లు నిందితులు ఎవ‌రో ఇంకా తేల‌లేదు. 14 ఏళ్ల క్రితం హాస్ట‌ల్ రూమ్ లో ర‌క్త‌పుమ‌డుగులో మృతి చెందిన ఆయేషా మీరా కేసు ఇప్పిటికి కొలిక్కిరాలేదు.

  • Written By:
  • Updated On - December 26, 2021 / 01:59 PM IST

బెజ‌వాడ‌లో సంచ‌ల‌నం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో అస‌లు నిందితులు ఎవ‌రో ఇంకా తేల‌లేదు. 14 ఏళ్ల క్రితం హాస్ట‌ల్ రూమ్ లో ర‌క్త‌పుమ‌డుగులో మృతి చెందిన ఆయేషా మీరా కేసు ఇప్పిటికి కొలిక్కిరాలేదు. ఎన్ని విచార‌ణ క‌మిటీలు వేసిన ఆ విచార‌ణ మాత్రం ముందుకు క‌ద‌ల‌డం లేదు.ఈ కేసు నేరుగా సీబీఐ టేక‌ప్ చేసి కొంత వ‌ర‌కు హాడావిడి చేసింది త‌ప్ప విచార‌ణ ఇప్ప‌టికీ పూర్తి చేయ‌లేక‌పోయింది.అయితే ఆయేషా మీరా త‌ల్లిదండ్రులు మాత్రం ఇంకా త‌మ‌కు న్యాయం జ‌రుగుతోంద‌నే నమ్మ‌కంతో పోరాటం చేస్తునే ఉన్నారు.

ఆయేషా మిరా కేసులో న్యాయాన్ని సమాధి కానివ్వద్దు అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట‌ర‌మ‌ణ‌కి ఆయెషా మిరా తల్లిదండ్రులు బహిరంగ లేఖ రాశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ప్రజా సంఘాల ఆద్వర్యంలో ఈబ ఈ బహిరంగలేఖను ఆయేషా మీరా తల్లిదండ్రులు విడుద‌ల చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఓ హత్య కేసులో 14సంవత్సరాల‌కు కూడా న్యాయం దక్కదా అంటూ లేఖ‌లో పేర్కొన్నారు. రాముని వనవాసం 14సంవత్సరాలకు పూర్తి అయ్యి ఆతరువాత పట్టాభిషేకం జరిగింది.. మా పాప చంపబడి 14సంవత్సరాలు నిండిపోయాయి అయినా న్యాయం జరగలేదంటూ ఆయేషా మీరా త‌ల్లి షంషాధ్ బేగం, తండ్రి ఇక్బాల్ బాషా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ ఏపీకి చెందిన వ్యక్తి ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్నారని…అందుకే ఆయనకు త‌మ బాధ‌ను విన్నవించుకుంటున్నామ‌ని తెలిపారు.ఆయేషా మీరా హ‌త్య కేసులో న్యాయం చేయాలని బహిరంగ లేఖ రాస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఈ లేఖను ఛీప్ జస్టిస్ చ‌ద‌వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. సీబీఐ కూడా కేసులో న్యాయం చేస్తుంద‌నే నమ్మకం త‌మ‌కు కలకడంలేదని.. ఇస్లాం మత ఆచారం కాదని సీబీఐ అడిగితే రెండెళ్ళ క్రితం త‌మ పాప‌కు రీపోస్టుమార్టం చేసిన శరీర అవయువాలు ఇచ్చామ‌ని.. ఇంత వ‌ర‌కు కనీసం సమాదానం చెప్పడంలేదని వారు ఆరోపించారు.

పోలీసులు రాజకీయ నేతలు డబ్బున్న వాళ్ళు కుమ్మక్కై మాకు న్యాయం చేయడంలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి ప్రక్క రాష్ట్రంలో జరిగిన దిశ కేసుకు స్పందించి ఒక చట్టాన్ని చేయ‌డం సంతోషమ‌ని..మరి మన రాష్ట్రంలో జరిగిన ఆయేషా మీరా కేసును ఎందుకు పట్టించుకోవడంలేదని ప్ర‌శ్నించారు. ఆయేషా మీరా కేసు విషయంలో న్యాయం జరిగితే ఎంతో మంది ఆడ పిల్లలకు న్యాయం జరుగుతుందని.. అందుకే చీఫ్‌ జస్టిస్ కు బహిరంగ లేఖ రాశామని ఆయేషా మీరా త‌ల్లిదండ్రులు తెలిపారు.