Site icon HashtagU Telugu

Avinash Reddy vs CBI : వివేకా హత్య కేసులో సీబీఐ కి అవినాష్ రెడ్డి మరో జలక్

Viveka Murder

Avinash Reddy Gave Another Jalak To Cbi In Viveka's Murder Case

Avinash Reddy vs CBI : వివేకా హత్య కేసులో సూత్రధారిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) మరోసారి సీబీఐకి జలక్ ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన రోజుల్లో విచారణకు రాలేనని తేల్చేశారు. బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా సోమవారం విచారణకు రావటం లేదని రాతపూర్వక ఉత్తరువు సీబీఐ కి పంపారు. అందుకు సీబీఐ కూడా ఏమి చేయలేక కోరలు పీకిన పాములా ఆడుతుంది. హత్య కేసులోని సూత్రధారి మాత్రం ఎంచక్కా పులివెందులకు వెళ్లారు. దీంతో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మంగళవారం సీబీఐ ఎదుట హాజరుకాలేదు. నాలుగు రోజుల తరవాత కలుద్దాం అంటూ గడువు కోరారు.

తన పార్లమెంటరీ నియోజకవర్గంలో ముందస్తుగా కార్యక్రమాలు ఉన్నాయని పేర్కొంటూ, షార్ట్ నోటీసుకు తాను హాజరు కాలేనని సీబీఐకి తెలియచేయడం సీబీఐ అధికారులను అవినాష్ విచారిస్తున్నారా? అవినాష్ ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారా? అనే సందహం కలగటం సర్వసాధారణం.

అవినాష్ రెడ్డి (Avinash Reddy) మంగళవారం కడప జిల్లా పులివెందులకు వెళ్లారు. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రాంతీయ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సోమవారం నోటీసులో ఆదేశాలు జారీ చేసింది.ఇప్పటికే నాలుగు సార్లు సీబీఐ విచారించిన కడప ఎంపీ గత నెలలో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 28న హైకోర్టు విచారణను జూన్ 5కి వాయిదా వేసింది. ఈ కేసులో ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు కోర్టు నిరాకరించింది.

ఆయన అరెస్టును ఏప్రిల్ 25 వరకు నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు గతంలో రద్దు చేసింది. వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహతో కూడిన ధర్మాసనం కూడా ఈ కేసు దర్యాప్తును పూర్తి చేసేందుకు గడువును జూన్ 30 వరకు పొడిగించింది. సీబీఐకి ఏప్రిల్ 30ని గడువుగా సుప్రీంకోర్టు గతంలో నిర్ణయించింది. ఎన్నికలకు ముందు 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు.

68 ఏళ్ల రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి చొరబడి హత్య చేశారు. కొంతమంది బంధువులపై అనుమానం వ్యక్తం చేసిన సునీతారెడ్డి పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు 2020లో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. సునీతారెడ్డి పిటిషన్‌పై గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు కేసును హైదరాబాద్‌కు బదిలీ చేసింది.

గత నెలలో అవినాష్‌ రెడ్డి (Avinash Reddy) తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. పలు మార్గాల ద్వారా విచారణ సందర్భంగా సేకరించిన సమాచారం.ప్రకారం అవినాష్ సూత్రధారిగా హత్య జరిగిందని సీబీఐ తేల్చింది. కానీ ఆయన్ను అరెస్ట్ చేయడానికి ధైర్యం చేయలేక తిప్పలు పడుతుంది. ఆ కోవలోకే మంగళవారం అవినాష్ రాసిన లేఖ కూడా వస్తుంది. అంటే అవినాష్ ఏది చెబితే సీబీఐ అది వింటుందన్నమాట.

మళ్ళీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

Also Read:  BRS Plan: ఏపీలో BRS ఎత్తుగడ! కాంగ్రెస్ తో కలిసి మహా కూటమి దిశగా..!