Site icon HashtagU Telugu

YS Avinash Reddy : అవినాష్ రెడ్డి కి బిగిస్తున్న ఉచ్చు

Ys Avinash

Ys Avinash

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder Case) విచారణలో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా సీబీఐ అధికారులు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) పాత్రపై కీలక విషయాలు వెల్లడయ్యాయి. విచారణను తప్పించుకోవడానికి, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సీబీఐ అధికారులపై తప్పుదోవ పట్టించేలా తప్పుడు కేసులు పెట్టడం, వివేకా కుటుంబసభ్యులనే నిందితులుగా మార్చే ప్రయత్నాలు చేసినట్లు అఫిడవిట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

PF Amount Withdraw: మీకు పీఎఫ్ ఖాతా ఉందా? అయితే సింపుల్‌గా డ‌బ్బు విత్ డ్రా చేసుకోండి ఇలా!

వివేకా కుమార్తె డాక్టర్ సునీత కేసును తీవ్రంగా తీసుకుని పోరాడుతుండటంతో అవినాష్ రెడ్డి వర్గం ఆమెపై కుట్ర పన్నింది. హత్య జరిగిన వెంటనే పోలీసులు, అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేసి పోస్టుమార్టం జరగకుండా చూసేందుకు ప్రయత్నించారు. కానీ సునీత నిరసన వ్యక్తం చేయడంతో అంతిమక్రియలు నిలిపివేయాల్సి వచ్చింది. పైగా సీబీఐ విచారణలో అవినాష్ రెడ్డి సహకరించకపోవడంతో ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

CM Chandrababu : బెట్టింగ్‌ల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొద్దాం : సీఎం చంద్రబాబు

ఈ కేసు సీబీఐకి ప్రతిష్టాత్మకంగా మారినందున అన్ని కోణాల్లోనూ పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. విచారణను తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కటిగా విఫలమవుతున్నాయి. సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని ఎంత సీరియస్‌గా తీసుకుంటుందనే దానిపైనే ఇక అవినాష్ భవితవ్యాన్ని ఆధారపడి ఉంటుంది. కేసు మలుపులు, తాజా పరిణామాలను బట్టి చూస్తే త్వరలోనే వివేకా హత్య కేసులో పెద్ద సంచలనాలు వెలుగు చూడొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.