Site icon HashtagU Telugu

Viveka murder case: సీబీఐ విచారణ వేళ అవినాశ్ రెడ్డి బిగ్ ట్విస్ట్.. ఏం జరిగిందంటే!

Viveka Murder

Avinash Reddy Gave Another Jalak To Cbi In Viveka's Murder Case

వివేకా హత్య కేసు సినిమా మాదిరిగా అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే సీబీఐ మరోమారు కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి నోటీసులు అందివ్వడం, ఆయన రాలేనంటూ లేఖలు సంధించడం, మళ్లీ సీబీఐ రియాక్ట్ కావడం లాంటి అంశాలన్నీ చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో మరోసారి సీబీఐ విచారణకు రావటంలేదు. అవినాశ్ రెడ్డి తల్లికి ఆరోగ్యం క్షీణించటంతో హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు. దీంతో మరోసారి ఆయన సీబీఐ విచారణకు గైర్హాజరయ్యారు. అవినాశ్ తల్లి చాతి నొప్పితో పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్ లో చేరారు.

సీబీఐ విచారణకు హాజరుకావటానికి హైదరాబాద్ చేరుకున్న అవినాశ్ కు తల్లికి ఆరోగ్యం క్షీణించింది అనే సమాచారంతో పులివెందులకు తల్లిని చూసేందుకు హుటాహుటిన బయలుదేరారు. దీంతో ఈరోజు విచారణకు హాజరుకాలేకపోతున్నానని తన తల్లి ఆరోగ్యం బాగాలేదని మరో సారి హాజరు అవుతానాని సీబీఐకి సమాచారం ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో అవినాశ్ ఆరు సార్లు విచారణ ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో మరోసారి విచారణకు హాజరుకానున్న క్రమంలో సడెన్ గా తల్లి అనారోగ్యంపాలు కావటంతో హైదరాబాద్ నుంచి పులివెందులకు హుటాహుటిన బయలుదేరారు అవినాశ్.

కాగా..మే 16వ తేదీన హాజరు కావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే, తనకు ముందస్తు షెడ్యూల్‌లో భాగంగా ఇతర కార్యక్రమాలు ఉన్నాయని, నాలుగు రోజులు గడువు కావాలంటూ చివరి నిమిషంలో అవినాశ్‌ విచారణకు గైర్హాజరయ్యారు. కానీ ఈరోజు విచారణకు కచ్చితంగా హాజరుకావాల్సి ఉండగా మరోసారి తల్లి అనారోగ్యం వల్ల హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. ఈ అన్యూహ్య పరిణామంపై సీబీఐ ఎలా వ్యవహరిస్తుందో అనేది వేచి చూడాల్సిందే.

Also Read: Tirumala Darshan: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 30 గంటలు!