ఏపీలో మహిళలపై దాడులు , అత్యాచారాలు ఆగడం లేదు. ప్రభుత్వం మారింది మహిళలకు మంచి రోజులు వచ్చినట్లే అని అంత భావించారు కానీ ప్రభుత్వాలు మారిన కామాంధులు మాత్రం మారడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అత్యాచారం , లైంగిక దాడి అనే ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా తిరుపతి లో దారుణం జరిగింది. జువైనల్ హోమ్ లో ఉండే బాలికపై ఓ బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తిరుపతిలో అనాథ బాలికలతో పాటు నేర చరిత్ర ఉన్న బాలికల కోసం ప్రత్యేక వసతి గృహంలో ఉండే బాలికలు వివిధ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో గృహంలో ఉంటూ స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఓ బాలికపై అత్యాచారయత్నం జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
గతంలో ఈ బాలిక ఉన్న సత్యవేడులో హోమ్ వద్ద రిషి అనే యువకుడు ఈ నెల 21న నెహ్రూ మున్సిపల్ స్కూల్ వద్దకు వచ్చి స్టడీ అవర్‌లో బాలికపై అత్యాచారయత్నంకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఒంటిపై గాయాలతో సాయంత్రం హోమ్‌కి వెళ్లిన బాలికను తోటి విద్యార్థులతో పాటు సిబ్బంది ప్రశ్నించారు. దీంతో బాలిక జరిగిన విషయం తెలిపింది. అయితే ఈ విషయం బయటకు రాకుండా జువైనల్ హోమ్ సూపరింటెండెంట్ నయోమి దాచిపెట్టారు. హోమ్ లో ఉండే డాక్టర్ బాలికల సంక్షేమ శాఖ అధికారులకు విషయం చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారుల సూచనలతో జరిగిన ఘటనపై జువైనల్ హోమ్ సూపరింటెండెంట్ వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి.. బాలికను వైద్య పరీక్షల కోసం రుయా ఆసుపత్రికి తరలించారు.
Read Also : 4455 Jobs : మరో నాలుగు రోజులే గడువు.. 4,455 జాబ్స్‌కు అప్లై చేసుకోండి