Site icon HashtagU Telugu

Polnati Seshagiri Rao: టీడీపీ నేత పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం

Polnati

Polnati

ఏపీలోని కాకినాడ జిల్లా తునిలో మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. భవాని మాల వేషంలో వచ్చిన దుండగుడు భిక్ష తీసుకుంటున్నట్లుగా నటించి తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరిరావుపై దాడి చేశాడు. ఈ ఘటనలో శేషగిరిరావు చేతికి, తలకు బలమైన గాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కాకినాడలో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తుని పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.