Site icon HashtagU Telugu

AP : దాహం వేసి మంచినీళ్లు అడిగితే ..మూత్రం పోసి అవమానిస్తారా..? – నారా లోకేష్

Nara Lokesh (2)

Nara Lokesh (2)

జగన్ (Jagan ) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి దళితులపై (Attacks on Dalits) దాడులు ఎక్కువై పోతున్నాయని ..పోలీసులు , కోర్టులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మొదటి నుండి ప్రతిపక్ష పార్టీలు , దళిత సంఘాలు విమర్శలు చేస్తున్న..ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా (NTR District)కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడి ని అత్యంత దారుణంగా హింసించి , మంచి నీరు అడిగితే ..మూత్రం పోసి అవమానించారు. ఈ ఘటన ఫై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. జగన్ రెడ్డి (jagan) ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ (Doctor Sudhakar) నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకూ ఎంతోమంది దళితబిడ్డలు బలి కాగా, తాజాగా మరో దారుణం చోటుచేసుకుందని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్‌ (Shyam Kumar)ను కొందరు శాడిస్టులు నిర్బంధించి, నాలుగు గంటల పాటు చిత్రహింసల పాల్జేయడమేగాక… దాహం వేసి మంచినీళ్లు అడిగితే సభ్యసమాజం తలదించుకునేలా మూత్రం పోసి అవమానించారని నారా లోకేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు ఏమాత్రం మనస్సాక్షి ఉన్నా ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత దళితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటైన చట్టబద్ధ సంస్థకు అధిపతి అయిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు ఈ ప్రభుత్వంలో తానే బాధితుడిని అని వాపోయారన్నారు

Read Also : Vijay Devarakonda : చిన్నారికి సాయం చేసి విజయ్ తన గొప్ప మనసు చాటుకున్నాడు