అమరావతి మహిళలపై సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao), కృష్ణం రాజు (Krishnam Raju)చేసిన వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ‘అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ జర్నలిస్టుల ముసుగులో ఉన్న వ్యక్తులు నోరు పారేసుకోవడంపై మహిళా లోకం భగ్గుమంటుంది. రోత చానల్ లైవ్ డిబేట్‌లో అమరావతి మహిళలపై వారు చేసిన వ్యాఖ్యలపై ఆదివారం నుండి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుతో పాటు కొమ్మినేని శ్రీవాసరావును తక్షణం అరెస్టు చేయాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు.
Kia : రక్షణ రంగంలో గేమ్‌చేంజర్.. కియా KMTV వచ్చేసింది..!
ఈ మేరకు పలు జిల్లాల్లోని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. నిరసన ర్యాలీలు నిర్వహించారు. ‘సాక్షి’ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసి, ఆ పత్రిక ప్రతులను దహనం చేశారు. ‘సాక్షి’ చానల్‌లో మహిళలను అగౌరవపరుస్తుంటే ఆ సంస్థ యాజమాని భారతీరెడ్డి ఎందుకు స్పందించలేదని నిలదీశారు. భారతీరెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు మంగళవారం కూడా పలు చోట్ల సాక్షి ఆఫీస్ లపై దాడులు చేశారు.
ఏలూరు జిల్లాలోని సాక్షి కార్యాలయంపై పలు మహిళ సంఘాలు దాడి చేశారు. పెట్రోల్ బాటిళ్ళు, రాళ్ళతో దాడి చేయడంతో కార్యాలయంలో ఉన్న సోఫా సెట్లు, ఫర్నిచర్ ఆగ్నికి ఆహుతయ్యాయి. ఆఫీసు ఉద్యోగి కారు పాక్షికంగా ధ్వంసమైంది. అటు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సాక్షి కార్యాలయంపై మంగళవారం దాడుల చేసారు. కార్యాలయం బోర్డును ధ్వసం చేసి వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ప్రస్తుతం పోలికియూ కొమ్మినేని అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరుపరచగా..ఆయన్ను రిమాండ్ కు ఆదేశించింది కోర్ట్. అయినప్పటికీ వైసీపీ నేతలు , అధినేత జగన్ సైతం కొమ్మినేని వెనకేసుకొని రావడం విడ్డురంగా ఉంది.