Site icon HashtagU Telugu

Pithapuram : సాయి ధరమ్ తేజ్‌పై దాడి..

Attack On Teju

Attack On Teju

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార – ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో కొన్ని చోట్ల ఉద్రిక్తత ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార పార్టీ కి చెందిన నేతలు , అభ్యర్థి తాలూకా మనుషులు..ప్రతిపక్ష పార్టీ నేతల ఫై దాడులకు పాల్పడుతున్నారు. మొన్న మచిలీపట్నంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంటిపై వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు (YCP Candidate Parni Kittu) అనుచరుల దాడికి పాల్పడగా..నిన్న బిజెపి అభ్యర్థి సీఎం రమేష్ (CM Ramesh) ఫై దాడికి పాల్పడ్డారు. ఈరోజు జనసేన పార్టీ ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మేనల్లుడు , నటుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఫై దాడి చేసారు. కానీ అదృష్టవశాత్తు ఆయనకు ఏమికాలేదు. ఓటమి భయంతో ఇలా దాడులకు పాల్పడుతున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రెండు రోజులుగా తేజు పిఠాపురం లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం తాటిపర్తిలో ప్రచారం చేస్తుండగా..కొంతమంది ఆకతాయిలు తేజ్ ఫై కూల్ డ్రిక్స్ బాటిల్స్ విసిరారు. ఈ క్రమంలో తేజు తప్పుకోవడం తో ఆయన పక్కనే ఉన్న జనసేన వీరాభిమాని నల్ల శ్రీధర్‌కు (Nalla Sridhar) ఆ బాటిల్ తగిలింది. దీంతో.. అతని కంటిపై గాయమై, తీవ్ర రక్తస్రావమైంది. ఇది వైసీపీ స్థానిక నేతల పనే అయ్యుండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు కూడా తేజ్ రోడ్ షోలో భాగంగా తాటిపర్తి నుంచి చిన్న జగ్గంపేట వెళ్తున్న సమయంలోనూ వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. బాణసంచా బాంబులు వేస్తూ హల్‌చల్ చేశారు. అంతే కాకుండా జనసేన శ్రేణులు, మెగా అభిమానులతోనూ వాగ్వివాదానికి దిగారు. దీంతో కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి, జనసేన శ్రేణులను నియంత్రించి, వైసీపీ వారిని వదిలేశారు. ఈ దాడిని పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఓటమి భయం తో ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read Also : Cheetah Dies : నారాయణపేట జిల్లాలో ఎండదెబ్బకు చిరుత మృతి