Site icon HashtagU Telugu

AP : వైసీపీ లీడర్స్ అధికార మదం..నడిరోడ్డు ఫై RTC ఉద్యోగులను చావబాదారు

RTC Driver Singh

Kavali Rtc Driver Attack

ఏపీలో వైసీపీ లీడర్ల (YCP Leaders) దారుణాలు ఎంత చెప్పిన తక్కువే. అధికారం మదంతో రెచ్చిపోతున్నారు. మాది అధికారం..మావాడు ఎమ్మెల్యే (YCP MLA) , మా కులం వాడు మంత్రి (YCP Minister)..మా మనిషి జగన్ (CM Jagan) అంటూ ఎవరికీ వారు చెప్పుకుంటూ సామాన్య ప్రజలనే కాదు ప్రభుత్వ అధికారుల ఫై కూడా జులం చెలాయిస్తున్నారు. ఇది తప్పు అంటే చావబాదడం..ఇలా చెయ్యకూడదంటే ఇంటికెళ్లి వేటకొడవళ్లతో దాడులు చేయడం చేస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి రాగా..తాజాగా తన కారు కు ఆర్టీసీ డ్రైవర్ (RTC Driver) సైడ్ ఇవ్వలేదని చెప్పి..ఏకంగా సినిమాలో మాదిరి బస్సును వెంబడించి..నడిరోడ్డు ఫై బస్సు ను ఆపి..డ్రైవర్ , కండక్టర్ లను కిందకు దించి చావగొట్టారు. ఇదేంటి అని అడిగిన వారిపై కూడా దాడి చేసేందుకు ట్రై చేసారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలి (Kavali RTC Driver Attack) లో చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

విజయవాడ డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు కావలి నుంచి విజయవాడ వెళ్తోంది. అయితే కావలిలోని ట్రంకు రోడ్డు లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సింగ్ (RTC Driver Singh ) తన ముందున్న కారు అడ్డు తీయాలంటూ హారన్ కొట్టాడు. దీంతో ఆ కారు డ్రైవ్‌ చేస్తున్న వ్యక్తి… బస్సు డ్రైవర్ తో వాదనకు దిగాడు. అనంతరం అక్కడే ఉన్న పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించారు. గొడవ సద్దుమణిగిందని అంత అనుకున్నారు. కానీ కానీ ఈ విషయాన్ని ఆ కారు డ్రైవ్‌ చేస్తున్న వ్యక్తి తన మిత్రులతో చెప్పడం తో ..వారంతా ఆర్టీసీ బస్సును వెంబడించారు. నడిరోడ్డు ఫై బస్సును ఆపేసి.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లను కిందకు దించి దారుణంగా కొట్టారు. డ్రైవర్, కండక్టర్ల ఫై దాడి చేసింది కావలి వైసీపీ నేతలు శివరెడ్డి, విల్సన్ గా తెలుస్తుంది. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ కావడం తో నెటిజన్లంతా వైసీపీ ఫై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వారిని మనం ఎన్నుకున్నది..ఇంత చేస్తున్న వారికా ఇంకా సపోర్ట్ చేసేది అంటూ ఎవరికీ వారు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ ఘటన పట్ల ప్రభుత్వం స్పందిస్తుందా..? లేదా అనేది చూడాలి.

Read Also :