Attack on Dastagiri Father : దస్తగిరి తండ్రిపై దాడి

వివేకా హత్య కేసు (Viveka Murder Case)కు సంబంధించి అఫ్రూవర్‌ దస్తగిరి (Dasthagiri) తండ్రిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసారు. ప్రస్తుతం దస్తగిరి తండ్రి హాజీవలి పులివెందుల ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహాశివరాత్రి నేపథ్యంలో … నిన్న రాత్రి హాజీవలి శివరాత్రి జాగరణకు వెళ్లారు. దీంతో నామాలగుండు వద్ద వైసిపి కార్యకర్తలు దస్తగిరి తండ్రిపై దాడి చేశారు. జగన్‌పై దస్తగిరి పోటీ చేసే అంత మొనగాడా ? అంటూ దాడి చేసినట్లు సమాచారం. పులివెందులలో ఆటో […]

Published By: HashtagU Telugu Desk
Attack On Dastagiri Father

Attack On Dastagiri Father

వివేకా హత్య కేసు (Viveka Murder Case)కు సంబంధించి అఫ్రూవర్‌ దస్తగిరి (Dasthagiri) తండ్రిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసారు. ప్రస్తుతం దస్తగిరి తండ్రి హాజీవలి పులివెందుల ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహాశివరాత్రి నేపథ్యంలో … నిన్న రాత్రి హాజీవలి శివరాత్రి జాగరణకు వెళ్లారు. దీంతో నామాలగుండు వద్ద వైసిపి కార్యకర్తలు దస్తగిరి తండ్రిపై దాడి చేశారు. జగన్‌పై దస్తగిరి పోటీ చేసే అంత మొనగాడా ? అంటూ దాడి చేసినట్లు సమాచారం. పులివెందులలో ఆటో నడుపుకుంటూ షేక్ హజీ వల్లి జీవన కొనసాగిస్తున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి శివరాత్రి సందర్భంగా నామాల గుండు వద్దకు వెళ్లాడు. అక్కడ తనపై ముగ్గురు వ్యక్తులు దాడికి దిగారని బాధితుడు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈ దాడి పట్ల జై భీమ్ భారత్ పార్టీ చీఫ్ జడ శ్రావణ్ కుమార్ (Jai Bheem Bharat Party Chief Jada Sravan) వ్యాఖ్యలు చేసారు. పులివెందుల నుంచి జగన్ ఫై పోటీ చేసే మొనగాడా అంటూ దస్తగిరి తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేసి చంపటానికి వైసీపీ గుండాలు ప్రయత్నించాయని మండిపడ్డారు. దస్తగిరి పోటీలో నుంచి విరమించుకోకపోతే కుటుంబం మొత్తాన్ని హతమారుస్తామంటూ హెచ్చరికలు చేశారన్నారు. దస్తగిరి అభ్యర్థిత్వంపై ఏమీ చేయలేని వైఎస్ అవినాష్ రెడ్డి & జగన్.. దస్తగిరి కుటుంబ సభ్యులపై దాడి చేయటం అత్యంత శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే దస్తగిరి కుటుంబ సభ్యులందరికీ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జరిగిన దారుణంపై 12న సీబీఐ కోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయవలసిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.

Read Also :  CBN Meets Revanth : చంద్రబాబు తో రేవంత్ భేటీ అయ్యారా..?

  Last Updated: 09 Mar 2024, 01:00 PM IST