Site icon HashtagU Telugu

Attack On Anchor Kavya Sri : లేడి యాంకర్ పై మార్గాని భరత్ అనుచరుడు దాడి

Attack On Anchor Kavya Sri

Attack On Anchor Kavya Sri

రాజమండ్రిలో యాంకర్‌ అండ్ ఈవెంట్‌ ఆర్గనైజర్‌ కావ్యశ్రీ (Anchor Kavya Sri)పై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ (EX MP Margani Bharat) అనుచరుడు దాడి చేసాడు. బాకీ డబ్బులు అడిగినందుకు కావ్య శ్రీ, తన తండ్రిపై నాగరాజుపై దాడి చేశాడు. డబ్బులు ఇస్తామని పిలిచి దాడి చేశారని కావ్యశ్రీ తండ్రి నాగరాజు (Nagaraju) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కావ్యశ్రీ ఫ్యామిలీ రాజమండ్రిలో నివాసం ఉంటోంది. కోనసీమలో ఈవెంట్ యాంకరింగ్ చేసేందుకు కావ్యశ్రీ, ఆమె తండ్రి వచ్చారు. కాగా కావ్యశ్రీ ఫాదర్ వద్ద మూడేళ్ల కిందట వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అనుచరుడు నల్లూరి శ్రీనివాస్ అప్పు రూపంలో కొంత డబ్బు తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీంతో రాజమండ్రిలో ఉన్న నల్లూరు శ్రీనివాసరావు (Nalluru Srinivasa Rao) ఇంటికి వెళ్లారు కావ్యశ్రీ,ఆయన తండ్రి.

ఇరువురు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దీంతో పట్టరాని కోపంతో యాంకర్ కావ్యశ్రీ, ఆయన తండ్రిపై దాడికి పాల్పడ్డాడు శ్రీనివాస్. ఈ ఘటనపై బాధితులు కావ్య.. ప్రకాష్‌నగర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా ఇదే విషయంపై గతంలో మాజీ ఎంపీ మార్గాన్ని భరత్‌కు చెప్పామని.. దానికి ఆయన కూడా డబ్బులు ఇప్పిస్తానని ఒప్పుకున్నారని యాంకర్ కావ్య శ్రీ తండ్రి తెలిపాడు. కానీ ఆయనే ఇప్పుడు తమ అనుచరుల చేత మళ్ళీ తమపై కేసు పెట్టిస్తున్నారని యాంకర్ తండ్రి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు.

Read Also : Ban On Firecrackers: ఢిల్లీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. బాణాసంచాపై నిషేధం!