ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి విడదల రజినీ(Vidadala Rajini)పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు (SC, ST Atrocity Case) నమోదైంది. చిలకలూరిపేట పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసును నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 2019లో సామాజిక మాధ్యమాల్లో రజినీపై ఓ పోస్టు పెట్టిన కారణంగా తనను హింసించారని పిల్లి కోటి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అయితే, అప్పటి నుంచి ఈ వ్యవహారం పోలీసుల దృష్టిలో ఉన్నప్పటికీ, కేసు నమోదు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Delhi Election Results 2025 : హ్యాట్రికా..? లేక 27 ఏళ్ల తర్వాత అధికారమా?
పిల్లి కోటి ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ సూర్యనారాయణ ద్వారా తనను అన్యాయంగా వేధించారని ఆరోపించారు. దీనిపై స్థానిక పోలీసులకు పలు మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన రాలేదని, చివరగా హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. హైకోర్టు దీనిపై విచారణ జరిపి, తగిన విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి విడదల రజినీతో పాటు ఆమె పర్సనల్ అసిస్టెంట్లు (PA) మరియు అప్పటి సీఐ సూర్యనారాయణపై కూడా కేసు నమోదు చేశారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సహా, సంబంధిత సెక్షన్ల కింద విచారణ కొనసాగనుంది.
ఈ ఘటనపై మాజీ మంత్రి విడదల రజినీ స్పందించాల్సి ఉంది. తనపై నమోదైన కేసు గురించి ఏ విధంగా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే ఈ కేసు రాజకీయ పరమైనదా? లేక నిజంగా వివక్షకు గురైన వ్యక్తికి న్యాయం జరుగుతుందా? అనే కోణంలో చర్చ జరుగుతోంది.