Site icon HashtagU Telugu

AP: కూతుర్ని చంపి.. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన తండ్రి..!!

USA

USA

ఏపీలోని విశాఖపట్నంలో దారుణం జరిగింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కన్న కూతుర్ని చంపిన కన్న తండ్రి..ఆ తర్వాత హత్య చేసినట్లు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పోస్టు చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది పరువు హత్యగా భావిస్తున్నారు. దీంతో విశాఖలో కలకలం రేగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్లితే… వరప్రసాద్, హేమలత దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. 13ఏళ్ల క్రితం వరప్రసాద్ ను భార్య వదిలేసింది. అప్పటి నుంచి ఇద్దరు ఆడపిల్లలను వరప్రసాద్ పెంచాడు. పెద్ద కూతూరు ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. రెండు రోజుల క్రితం చిన్న కూతురు కూడా ఓ వ్యక్తితో వెళ్లిపోయిందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

కట్టుకున్న భార్య, కన్న కూతుళ్లు వదిలేసి వెళ్లారన్న మనస్థాపంతో వరప్రసాద్ చిన్న కూతురు లిఖితను చంపి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. వరప్రసాద్ ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు.

Exit mobile version