Site icon HashtagU Telugu

Atmasakshi Survey: ఆత్మసాక్షి సంచలన సర్వే, సగం కాబినెట్ ఓటమి, అధికారంలోకి టీడీపీ

Atmasakshi Sensational Survey, Defeat Of Half The Cabinet, Tdp To Power

Atmasakshi Sensational Survey, Defeat Of Half The Cabinet, Tdp To Power

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆత్మ సాక్షి తాజా సర్వే తేల్చింది. కనీసం 10 మంది మంత్రులు ఒడిపోతారని స్పష్టం చేసింది. ఆ జాబితాలో మంత్రి రోజా మొదటి వరసలో ఉన్నారు.

ప్రస్తుతం ఎన్నికలు జరిగితే వైసీపీకి 63 సీట్ల దాకా వస్తాయని తేల్చింది. అలాగే తెలుగుదేశానికి 78 దాకా సీట్లు జనసేనకు 7 సీట్లు అని పేర్కొంది. అదే విధంగా వైసీపీ మంత్రులు చాలా మంది ఓటమి బాటన ఉన్నారని సర్వే పేర్కొంది. ముందుగా శ్రీకాకుళం జిల్లా వరకూ వస్తే మంత్రి సీదరి అప్పలరాజు ఓటమి ఖాయమని పేర్కొంది. అలాగే మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు సీటు అయిన శ్రీకాకుళంలో హోరాహోరీ పోరు ఉందని పేర్కొంది.విశాఖ జిల్లాకు వస్తే మంత్రి గుడివాడ అమరనాధ్ సీటు అయిన అనకాపల్లి టీడీపీ పరం అవుతుందని లెక్క వేసింది. మరో మంత్రి బూడి ముత్యాలనాయుడు సీటు అయిన మాడుగులలో గట్టి పోటీ ఉంటుందని గెలుపు ఎవరితో చెప్పలేమని స్పష్టం చేసింది. ఇక తూర్పు గోదావరి జిల్లా వరకూ చూస్తే మంత్రి పినిపె విశ్వరూప్ ప్రతినిధ్యం వహిస్తున్న అమలాపురం సీటు టీడీపీ పరం అవుతుందని సర్వే చెబుతోంది.

అలాగే చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో ఓడిపోయే మంత్రిగా కారుమూరి నాగేశ్వరరావు ఉంటారని సర్వే చెబుతోంది. అదే విధంగా మహిళా మంత్రిగా ఉన్న తానేటి వనిత కోవూరు నియోజ్కవర్గంలో ఓటమి చెందడం డ్యాం ష్యూర్ అని సర్వే పేర్కొంది. ఇక క్రిష్ణా జిల్లాకు వెళ్తే మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న పెడన సీటులో ఓటమి ఖాయమని చెబుతోంది. గుంటూరు జిల్లాలో మంత్రి అంబటి రాంబాబు సీటు సత్తెనపల్లిలో హోరాహోరీ పోటీ ఉందని ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమని అంటున్నారు. ఇదే జిల్లాలో మరో మంత్రి మేరుగు నారార్జున ప్రాతినిధ్యం వహిస్తున్న వేమూరు అలాగే మహిళా మంత్రి విడదల రజనీ సీటు చిలకలూరిపేటలో ఓటమి ఖాయమని సర్వే చెబుతోంది.

ఇక చితూరు జిల్లా తీసుకుంటే మంత్రి సినీ నటి ఆర్కే రోజా నగరి సీటులో ఓటమి చెందడం ఖాయమని సర్వే పేర్కొంది. అలాగే కర్నూల్ జిల్లాలో చూసుకుంటే మంత్రి గుమ్మలూరి జయరాం ఓటమి కచ్చితమని సర్వే చెప్పేసింది. అలాగే అనంతపురం జిల్లాలో చూస్తే మహిళా మంత్రి ఉషా చరణ్ కళ్యాణ దుర్గంలో ఈసారి ఓడిపోతుందని శ్రీ ఆత్మ సాక్షి సర్వే తేల్చింది. టోటల్ గా చూస్తే వైసీపీ మంత్రులు పది మంది దాకా ఓటమి అంచున ఉంటె హోరాహోరీ పోటీలో ఎటూ తేలక మున్నా మంత్రులు ముగ్గురు ఉన్నారు. అంటే సగం మంత్రివర్గం తీవ్ర ఇబ్బందులో ఉందని ఈ సర్వే చెప్పేసింది అన్న మాట.

గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 17 దాకా శ్రీ ఆత్మసాక్షి (Atmasakshi) గ్రూప్ చేసిన సర్వేను చూస్తే ఏపీలో అధికార మార్పు తధ్యమనే అంటున్నారు. ఈ సర్వేకు నిబద్ధత ఉందని సర్వే చేసిన సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ సంస్థ 2019 ఎన్నికల్లో వైసీపీదే అధికారం అని చెప్పి 142 దాకా సీట్లు ఇచ్చింది. అయితే 151 సీట్లతో వైసీపీ పవర్ లోకి వచ్చింది. అలాగే ఎంపీ సీట్లు 22 దాకా వస్తాయని చెప్పింది అలాగే వచ్చాయి. ఇక తెలుగుదేశానికి 22 నుంచి 28 సీట్లు అంటే 23కి పరిమితం అయింది.ఈ సర్వే ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.శ్రీ ఆత్మసాక్షి (Atmasakshi) గ్రూప్ చేసిన ఈ సర్వే ప్రకారం చూస్తే ఏపీలో అధికారంలోకి వచ్చేది టీడీపీయే అన్నది అర్ధమవుతోంది. అదే టైం లో చాలా కీలకమైన నియోజకవర్గాలలో వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఓటమి అంచున ఉన్నారని ఈ సర్వే చెబుతోంది.

ఐదు నెలలు ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో ప్రజల మూడ్ ను తెలుసుకొని సర్వే చేసింది శ్రీ ఆత్మసాక్షి గ్రూప్. ఫిబ్రవరి 17వరకు సేకరించిన శాంపిల్స్ ప్రకారం.. అధికార వైసీపీకి 41.50శాతం ఓటు బ్యాంకు వస్తుందని తేలింది. ఇక ప్రతిపక్ష టీడీపీకి 42.50శాతం, జనసేనకు 11శాతం, ఇతరులకు 2.5 శాతం వస్తుందని తేలింది. ఇక సైలెంట్ ఓటు బ్యాంకు కూడా ఉందని.. ఎవరికీ ఓటు వేస్తామని చెప్పని వారు 2.5శాతం కీలకంగా ఉన్నారు.

Also Read:  Twitter: త్వరలో 10,000 అక్షరాలతో ట్వీట్‌లను పోస్ట్ చేయొచ్చు.. ఎలాన్ మస్క్ కీలక ప్రకటన