Site icon HashtagU Telugu

Atchannaidu : మంత్రి ధర్మాన ఫై చర్యలు తీసుకోవాలని..ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ

Atchannaidu Writes Letter T

Atchannaidu Writes Letter T

వాలంటీర్ల (Volunteers)ను పోలింగ్ ఏజెంట్లు (Polling Agents)గా నియమించాలన్న మంత్రి ధర్మాన (Dharmana Prasada Rao) వ్యాఖ్యలపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు (Atchannaidu ) ఆగ్రహం వ్యక్తం చేసారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం (CEC) అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి ధర్మానపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులో ఏర్పాటుచేసిన గ్రామ/వార్డు వాలంటీర్ల పురస్కారాల ప్రదానోత్సవంలో ధర్మాన మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో అవసరమైతే వాలంటీర్లే బూత్ ఏజెంట్లుగా పని చేయాల్సి వస్తుందని అన్నారు. 80 ఏళ్లు దాటిన వృద్ధులకు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ఇస్తున్నందున ఈ ఎన్నికల్లో వాలంటీర్లు కీలకపాత్ర వహించాల్సి ఉంటుందని , బూత్ ఏజెంట్లుగా కూర్చునేందుకు వాలంటీర్లకు ఎలాంటి అడ్డంకి ఉండదని ధర్మాన పేర్కొన్నారు. వాలంటీర్లకు సర్వీస్ రూల్స్ ఉండవని.. ఎవరికి ఓటు వేయాలో మీరు చెప్పకపోతే ఎవరు చెబుతారని ప్రశ్నించారు.

ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం లేఖ రాసారు. లేఖలో అన్ని సాక్ష్యాధారాలతో సహా ప్రస్తావించారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు చేశారని , అయినప్పటికి ఎన్నికల సంఘం ఆదేశాలను అధికార వైసీపీ నాయకులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. వృద్దులు, వికలాంగుల పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులో వాలంటీర్ల ప్రమేయం లేకుండా సీఈవో, డీఈవో, ఆర్వోలకు ఎన్నికల కమిషన్ వెంటనే ఆదేశాలివ్వాలని కోరారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు.

Read Also : Niharika : తిరుపతి నుండి జనసేన తరుపున నిహారిక పోటీ..?