Site icon HashtagU Telugu

AP : అచ్చెన్నాయుడు పేరుతో ఫేక్ ప్రెస్ నోట్ వైరల్..అందులో ఏముందంటే !

Atchannaidu Gives Clarity On Fake Press Note

Atchannaidu Gives Clarity On Fake Press Note

ఏపీలో ఫేక్ ప్రెస్ నోట్స్ (Fake Press Notes) కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నాయి. వీటిని ఎవరు ప్రచారం చేస్తున్నారో తెలియదు కానీ బిజెపి , టిడిపి పార్టీల రాష్ట్ర అధ్యక్షుల పేర్లతో ప్రెస్ నోట్స్ రిలీజ్ చేసి కార్యకర్తల్లో అలజడి సృష్టిస్తున్నారు.

ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తో రాష్ట్రంలో రాజకీయాల వేడి మొదలైంది. అక్రమ కేసులో చంద్రబాబు ను అరెస్ట్ చేయడం ఫై టిడిపి శ్రేణులు నిరసనలు , బంధు లు చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో కొంతమంది ఫేక్ ప్రెస్ నోట్స్ విడుదల చేస్తూ పార్టీ ఫై అసత్య ప్రచారం చేస్తున్నారు. మొన్నటికి మొన్న బిజెపి రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి (daggubati purandeswari)పేరుతో ఓ ప్రెస్ నోట్ ఎంత వైరల్ గా మారిందో తెలియంది కాదు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసన గా టిడిపి బంద్ కు పిలుపునిస్తే..ఆ బంద్ కు మద్దతు ఇస్తున్నట్లు పురందేశ్వరి పేరుతో ఓ నోట్ వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఆ నోట్ ఫేక్ దాని..దానిని నమ్మకూడదని స్వయంగా పురందేశ్వరి చెప్పడం జరిగింది.

Read Also : Sradda Das : గ్లామర్ షో తో మతి పోగొడుతున్న శ్రద్దా దాస్

ఇక ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో ఓ ప్రెస్‌నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ నోట్‌లో టీడీపీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని నేతలపై చర్యలు తీసుకుంటామన్నట్లుగా హెచ్చరించినట్లు ఉంది. అయితే ఈ నోట్ ఫేక్ అంటూ అచ్చెన్నాయుడు క్లారిటీ (Atchannaidu Gives Clarity On Fake Press Note ) ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుకు మద్దతుగా వేలాదిమంది స్వచ్చందంగా పాల్గొంటున్న నిరసన కార్యక్రమాలు చూసి ఓర్వలేక వైసీపీ సోషల్ మీడియా విభాగం తప్పుడు ప్రచారానికి తెరలేపింది. నా పేరుతో పార్టీ అనుబంధ విభాగాలను హెచ్చరిస్తూ ఒక ఫేక్ లెటర్ ను విడుదల చేసి ప్రజలను, పార్టీ కేడర్ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. పార్టీ అనుబంధ విభాగాలన్నీ ప్రతి జిల్లాలో క్రియాశీలకంగా చంద్రబాబుగారికి మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపడతున్నాయి. కావున దయచేసి ఎవరూ ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరుతున్నాను’ అంటూ ప్రెస్‌నోట్ విడుదల చేశారు అచ్చెన్నాయుడు.