Site icon HashtagU Telugu

AP : రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి 160 సీట్లుకు పైగా గెలవబోతున్నాం – అచ్చెన్నాయుడు

atchannaidu about 2024 elections

atchannaidu about 2024 elections

ఏపీలో రాబోయే ఎన్నికలు మాములుగా ఉండవు..175 కి 175 గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీ గెలుస్తుందా..? లేక టీడీపీ – జనసేన పార్టీలు కలిసి గెలుస్తాయా..? అనేది ఇప్పటి నుండే కాకరేపుతున్నాయి. ఇరు పార్టీల నేతలు ఎవరికీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు ఏమోకానీ..ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రజలు టీడీపీ – జనసేన పార్టీలే రావాలని కోరుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ను అరెస్ట్ చేసి వైసీపీ తన గోతిలో తానే పడ్డట్లు అయ్యిందని అంత చెపుతున్నారు.

ఇక టీడీపీ తో జనసేన పొత్తు ఖరారు కావడం తో ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుంది. ఇదే టీడీపీ – జనసేన నేతల్లో బలం చేకూర్చేలా చేస్తుంది. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేపట్టి బాబుకు సంఘీభావం తెలిపారు. మంగళగిరి పట్టణంలోని వైష్ణవి కళ్యాణ మండపం పక్కన సత్యమేవ జయతే పేరుతో నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, రైతు విభాగం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి టీ.ఎన్.టి.యూసి రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు దీక్షలో కూర్చున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చిన చంద్రబాబును ఎటువంటి ఆధారం లేని కేసులో అరెస్టు చేశారని మండిపడ్డారు. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు తప్పు చేయలేదు… ఎవరినీ చేయనివ్వలేదని పేర్కొన్నారు. 74 సంవత్సరాల వ్యక్తిని అక్రమంగా జైల్లో పెట్టడం అన్యాయమని వ్యాఖ్యానించారు. గాంధీ జన్మదినం సందర్భంగా చంద్రబాబు చేస్తున్న దీక్షకు మద్దతుగా 175 నియోజకవర్గాలలో సత్యమేవ జయతే దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే 160 సీట్లుకు పైగా గెలుస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు.

Read Also : NIA : కుట్ర కేసులో మావోయిస్టు సానుభూతిప‌రుడిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ