Site icon HashtagU Telugu

Astrologer Venu Swamy: ఆంధ్రలో మళ్ళీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి.. చంచల్‌గూడ జైలు ఇద్దరు సీఎంలను ఇచ్చింది: వేణు స్వామి

Astrologer Venu Swamy

Compressjpeg.online 1280x720 Image (1) 11zon

Astrologer Venu Swamy: వేణు స్వామి (Astrologer Venu Swamy) ఈ పేరు తెలుగు జనాలకు కొత్తగా పరిచయం చేసే పని లేదు. ముఖ్యంగా సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేసే అవసరం లేదు. ఏకంగా సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయాడు వేణు స్వామి. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు కూడా నిజం కావడంతో ఈయన చెప్పిందల్లా నమ్మడం కూడా మొదలుపెట్టారు ప్రజలు. కేవలం జనాలు మాత్రమే కాదు.. సినీ సెలబ్రిటీలు కూడా వేణు స్వామిని నమ్మి ఏకంగా ఆయనతో ప్రత్యేకమైన పూజలు చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

Also Read: Byjus Salaries : శాలరీలు ఇచ్చేందుకు ఇంటిని తాకట్టుపెట్టిన ‘బైజూస్’ ఓనర్

రష్మిక మందన్న, నిధి అగర్వాల్ లాంటి టాప్ హీరోయిన్లు సైతం ఇక వేణు స్వామితో ఇంట్లో ప్రత్యేకమైన పూజలు చేయించుకోవడం అటు సోషల్ మీడియాలో సంచలనంగా కూడా మారిపోయింది. అయితే ఇటీవల తెలంగాణ ఎలక్షన్స్ పై కామెంట్ చేశాడు వేణు స్వామి. తెలంగాణ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని అందుకోబోతుందని.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ మూడోసారి ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పాడు. ఒకవేళ అలా జరగకపోతే తాను జ్యోతిష్యం ఆపేస్తాను అంటూ చెప్పాడు. ఇటీవల విడుదలైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దింతో బిఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పిన వేణు స్వామి పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

అయితే మరోసారి వేణు స్వామి ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి ఎవరో చెప్పేశాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఏం మాట్లాడాడో ఆయన మాటల్లోనే వినండి.

ఈరోజే చెప్తున్నాను ఇంకా ఫర్దర్ గా చెప్పను. ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డియే వస్తాడు. 10 మంది కలిసి వస్తారా 20 మంది కలిసి వస్తారా 30 మంది కలిసి వస్తారా నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి వస్తాడు. రెండోది తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇద్దరి జాతకాలు కూడా సేమ్ బుధ మహర్దశ నడుస్తుంది. ఇద్దరు జైలుకు పోయి వచ్చారు. నన్ను చెప్పని అమ్మ కన్ఫ్యూజ్ చేయకు. ఇక్కడ గుర్తు ఉంచుకోవాల్సింది చంచల్‌గూడ జైలు ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చింది రెండు రాష్ట్రాలకు ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.