AP Assembly meetings : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 వరకు జరుగనున్నట్లు ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. మంగళవారం బడ్జెట్ పై అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యేలందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ప్రకటించారు. శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. బిల్లులు, చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు రెండు పూటలా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కాగా, 1995లో తెల్లవారుజామున 4 గంటలకు రాత్రి సమయంలో భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయని ఈ సందర్భంగా అయ్యన్న గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు విధిగా అసెంబ్లీకి హాజరవ్వాలని, చీఫ్ విప్, విప్‌లను మంగళవారం ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని అన్నారు. ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసినట్లు చెప్పారు. ప్రజా సమస్యలపై బాధ్యతాయుతమైన చర్చ జరపడం ఎమ్మెల్యేల బాధ్యత అని సీఎం పేర్కొన్నట్లు చెప్పారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే, మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే . సమావేశాలు ప్రారంభానికి ముందు సీఎం చంద్రబాబు వెంకట పాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. వెలగపూడిలో అసెంబ్లీ నిర్మించినప్పటి నుంచి వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం చంద్రబాబు కు ఆనవాయితీ. సమావేశాలు ప్రారంభం కాగానే.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెను ప్రవేశ పెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2.94లక్షల కోట్లతో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ 2024 ప్రవేశ పెట్టడం జరిగింది.
Read Also: Sanjay Bangar Daughter: అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ కోచ్ కుమారుడు!