ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి..ఇక ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ తరుణంలో చంద్రబాబు 4 వ సారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నెల 12న ఉదయం ఉ.11.27 గంటలకు చంద్రబాబు(Chandrababu)ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కృష్ణా జిల్లా కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలోని పన్నెండు ఎకరాల స్థలంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోడీ తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను భారీగా చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక వేదిక, బారికేడింగ్, బ్లాక్‌ల విభజన, పారిశుద్ధ్యం, అతిథులకు వసతుల కల్పనలో ఎలాంటి లోటూ లేకుండా చూస్తున్నారు. పార్కింగ్ స్థలాలు, ప్రధాన సభకు చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రహదారులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన సభాస్థలి, విమానాశ్రయం, ఐటీపార్కు, పార్కింగ్ స్థలాలను ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. విమానాశ్రయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నతాధికారుల బృందంతో రాష్ట్ర అదనపు కార్యదర్శి డీజీ ఎస్. బాగ్చి ఏర్పాట్లపై సమీక్షించారు.
ముందుగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎయిమ్స్ సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. అయితే ప్రధాని మోడీ తో పాటు ఎన్డీయే కూటమి ముఖ్యనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉండడం, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో అధికారులు, టీడీపీ నేతలు ఆ ప్రాంతం అనువుగా ఉండదని భావించి కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఎంపిక చేసారు.
Read Also : Ramoji Rao : రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు