స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సీఐడీ కూడా చంద్రబాబు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేసింది. గతంలో ఈ రెండు పిటిషన్‌లపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ఇరు వర్గాల వాదోపవాదనలతో న్యాయమూర్తి వాయిదా వేశారు. తాజాగా ఈ రోజు ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. చంద్రబాబు తరుపున సుప్రీకోర్టు సీనియర్ న్యాయవాది దూభే వాదనలు వినిపిచారు. అయితే మధ్యాహ్నం 12 వరకు ఆగాలి అని సిఐడి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలపడంతో ఐదు పది నిమిషాల కన్నా సమయం ఇవ్వలేనని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. 15 నిమిషాల తరువాత సీఐడీ తరుపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు వచ్చి తన వాదనలు వినిపించారు. అయితే వాదనల సమయంలో ప్రభుత్వ న్యాయవాదులపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. చెప్పిందే చెప్పి విసిగించవద్దంటూ న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహించే స్కీముల్లో స్కాంలు జరిగితే దానికి బాధ్యత HODలు తీసుకుంటారా?.. లేక ముఖ్యమంత్రి తీసుకుంటారా అని సీఐడీ తరుపున న్యాయవాదులను ఏసీబీ కోర్టు జడ్జి ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‍మెంట్ స్కీంలో జరిగిన స్కాం నుంచి A37 కు డబ్బు తిరిగి వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయా? జడ్జి ప్రశ్నించారు. నేరానికి సంబంధించిన ఆధారాలు ఉంటే చూపించాలని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని జడ్జి ఆదేశించారు.
We’re now on WhatsApp. Click to Join.