స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరుపున హరీష్ సాల్వే వర్చువల్‌గా తన వాదనలు వినిపించారు.ఇటు సిద్ధార్థ లూద్రా కూడా చంద్రబాబు తరుపున హైకోర్టులో వాదనలు వినిపించారు. ఉదయం నుంచి ఈ పిటిషన్‌పై వాడివేడిగా వాదనలు సాగాయి. సీఐడీ తరుపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్‌రోహతగి, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో స్కాం జరగలేదంటూ చంద్రబాబు తరుపు న్యాయవాదులు వాదించారు.ప్రధానంగా 17ఏ మీద వాదనలు జరిగాయి. ఆధారాలు లేకుండా రాజకీయ కక్షతోనే చంద్రబాబుని అరెస్ట్ చేశారని హరీష్ సాల్వే, లూధ్రా వాదించారు. మరోవైపు సీఐడీ తరుపున రంజిత్‌కుమార్ శుక్రవారం వరకు కౌంటర్‌కు సమయం ఇవ్వాలని కోరగా..అందుకు న్యాయమూర్తి తిరస్కరించారు. ఉదయం నుంచి ఈ కేసులో వాదనలు వింటున్నామని.. ఏ సమయమైన వాదనలు పూర్తిచేయాలని న్యాయమూర్తి తెలిపారు. దీంతో ఇరువర్గాలు వాదనలు వినిపించాయి. వాదనలు పూర్తి తరువాత ఉత్తర్వులను రిజ్వర్ చేశారు. రెండు రోజుల్లో తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది.
AP High Court : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

Ap High Court Chandrababu