Site icon HashtagU Telugu

Viveka Murder Case : అవినాష్ బెయిల్ రద్దు ఫై ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వ్ చేసిన కోర్ట్

Mp Avinash Reddy

Mp Avinash Reddy

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో కీలక వ్యక్తిగా ఆరోపణలు ఎదురుకుంటున్న వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి(MP Avinash Reddy) బెయిల్ రద్దు చేయాలంటూ కోర్ట్ లో వేసిన పిటిషన్‌పై విచారణ ముగిసింది. దీనిపై తీర్పు ను రిజర్వ్ చేసింది కోర్ట్. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హోరు సమ్మర్ ను మించి నడుస్తుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఫై ప్రతిపక్ష పార్టీలు జగన్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

వివేకా హత్య జరిగి ఐదేళ్లు గడుస్తున్నా తమకులు న్యాయం జరగలేదని..చంపిన వ్యక్తులను సీఎం జగన్ రక్షిస్తున్నాడంటూ వైస్ షర్మిల , సునీత లు ప్రతి సభల్లో , సమావేశాల్లో మాట్లాడుతూ వస్తున్నారు. మరోపక్క కూటమి పార్టీలు కూడా బాబాయ్ నే చంపిన వ్యక్తి..సామాన్య ప్రజలను చంపడం ఓ లెక్క అన్నట్లు ప్రచారం చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఈ కేసులో కీలక నిందితుడైన ఎంపీ అవినాష్ కు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ దస్తగిరి కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు. అవినాష్ బయట ఉండడం ఎంతమాత్రం మంచికాదని , సాక్ష్యాలను తనకు అనుకూలంగా చేసుకుంటున్నారని, వెంటనే ఆయన బెయిల్ ను రద్దు చేయాలంటూ దస్తగిరి తన ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఈయన పిర్యాదు ఫై చట్టపరంగా విచారణ జరుపుతున్నామని కోర్ట్ వెల్లడించింది. ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు దస్తగిరి పిటిషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. అయితే, నేడు ఇరు పక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వు చేస్తున్నట్లుగా తెలిపింది.

Read Also : Sitaram ramula kalyanam : సీతారాముల కల్యాణం.. ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరణ