Forbes List : ఫోర్బ్స్ టాప్ 500 లో నిలిచిన `అమ‌ర‌రాజా`

ఏపీ ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసిన అమ‌రరాజా గ్రూప్ ఫోర్బ్స్ జాబితాలో మ‌రోసారి స్థానం సంపాదించింది. టాప్ 500 కంపెనీల జాబితాలో నిలిచింది. తెలుగుదేశం పార్టీ యువ‌నేత‌, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోన్న అమ‌ర‌రాజా అంతర్జాతీయ గుర్తింపు పొంద‌డం విశేషం.

  • Written By:
  • Updated On - July 6, 2022 / 12:25 PM IST

ఏపీ ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసిన అమ‌రరాజా గ్రూప్ ఫోర్బ్స్ జాబితాలో మ‌రోసారి స్థానం సంపాదించింది. టాప్ 500 కంపెనీల జాబితాలో నిలిచింది. తెలుగుదేశం పార్టీ యువ‌నేత‌, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోన్న అమ‌ర‌రాజా అంతర్జాతీయ గుర్తింపు పొంద‌డం విశేషం.

ఈ కంపెనీ, ఫోర్బ్స్‌ 500 బెస్ట్ ఎంప్లాయ‌ర్స్ జాబితాలో నిలిచింది. ఆ మేర‌కు త‌న‌కు ద‌క్కిన గుర్తింపుపై అమ‌ర‌రాజా గ్రూప్ ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసింది. చిత్తూరు జిల్లా కేంద్రంగా ఈ సంస్థ కార్య‌క‌లాపాలు సాగిస్తున్న సంగ‌తి అందరికీ తెలిసిందే. “జ‌నం విలువ తెలిస్తే పోటీలో ముందుంటామ‌న్న విష‌యాన్ని తాము నమ్ముతామ‌ని.. విశ్వాసం, గౌర‌వం అన్న‌వే ఆ నమ్మ‌కానికి కార‌ణ‌మ‌ని కూడా అమ‌ర‌రాజా గ్రూప్‌ తెలిపింది“. ఆ దిశ‌గా ప‌య‌నించినందుకే తాము ఫోర్బ్స్ జాబితాలో చోటు ద‌క్కించుకున్నామ‌ని వెల్ల‌డించింది. ఈ న‌మ్మ‌కంతోనే మ‌రింత వృద్ధిని సాధిస్తామ‌ని కూడా ఆ సంస్థ ట్వీట్ చేసింది.

ఏడాదిన్న‌ర క్రితం ఆ కంపెనీ కాలుష్య నియంత్ర‌ణ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఉల్లంఘిస్తోంద‌ని ఏపీ ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, కంపెనీ విస్త‌ర‌ణ మీద ఆ ఎఫెక్ట్ ప‌డింది. కాలుష్య మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించ‌డంలేద‌ని ఆ కంపెనీ మీద జ‌గ‌న్ స‌ర్కార్ చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. ఆ కంపెనీ ఉద్యోగుల నుంచి వ‌చ్చిన వ్య‌తిరేక‌తను గమ‌నించిన జ‌గ‌న్ స‌ర్కార్ చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి ధైర్యం చేయ‌లేక‌పోయింది.

వాస్త‌వంగా కంపెనీ విస్త‌ర‌ణ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోన్న క్ర‌మంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాజ‌కీయ ప్ర‌తీకారానికి దిగింది. దీంతో యూనిట్ విస్త‌ర‌ణ‌ను త‌మిళ‌నాడుకు త‌ర‌లిస్తున్న‌ట్టు అప్ప‌ట్లో న్యూస్ వ‌చ్చింది. కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించే అమ‌ర‌రాజా కంపెనీ ఏ మాత్రం జ‌గ‌న్ ఒత్తిడికి లొంగ‌లేదు. సీన్ క‌ట్ చేస్తే, ఇప్పుడు అంత‌ర్జాతీయ గుర్తింపు ఆ కంపెనీకి వ‌చ్చింది. పోర్బ్స్ టాప్ 500 కంపెనీల్లో ఒక‌టిగా నిల‌వ‌డం ఏపీని ప్ర‌పంచ స్థాయిలో నిల‌బెట్టింది.