Site icon HashtagU Telugu

Rayapati Aruna : రాయపాటి అరుణ ను జనసేన నుండి దూరం చేయడానికి కుట్రలు చేస్తున్నారా..?

Are You Conspiring To Distance Rayapati Aruna From Janasena..

Are You Conspiring To Distance Rayapati Aruna From Janasena..

Rayapati Aruna : ప్రస్తుతం జనసేన లో ఉదయం నుండే ఇదే చర్చ జరుగుతుంది. జనసేన పార్టీ లో రాయపాటి అరుణ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. వీర మహిళా గా సాక్ష్యాత్తు పవన్ కళ్యాణ్ నే చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ ఫై , పవన్ కళ్యాణ్ ఫై ఎవరు ఎలాంటి విమర్శలు , ఆరోపణలు చేసిన వాటిని ఖండించడానికి ముందుగా రాయపాటి అరుణ (Rayapati Aruna) ముందుకు వస్తుంది. టీవీ డిబేట్ లోనైనా , పబ్లిక్ కార్యక్రమాల్లో నైనా మరెక్కడైనా సరే అరుణ ముందుండి ఆ ఆరోపణలను ఖండిస్తోంది. అలాంటి అరుణ ను ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రోల్ చేస్తున్నారు.

గతంలో ఎప్పుడో ఆమె ఓ టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్లో వైస్సార్సీపీ నేత సుందర రామ శర్మ మాటలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా.. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన ప్రభావం రాష్ట్ర ప్రజలపై పడిందని.. కానీ చిరంజీవిది ఏముంది.. వెళ్లి మళ్లీ సినిమాలు చేసుకుంటున్నారంటూ మాట్లాడారు. ఆమె చాలా విషయాలు మాట్లాడినప్పటికీ.. రాజకీయ ప్రత్యర్థులు తమకు అవసరమైన ఈ బిట్‌నే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ చర్చ జరిగి చాల నెలలు అవుతున్నప్పటికీ.. ఇప్పుడు దీనిని బయటకు తీసి అరుణ ఫై వ్యతిరేకత పెంచుతున్నారు. దీనిని మెగా అభిమానుల పేరుతో , జనసేన పేరుతో అరుణను దారుణంగా ట్రోల్ చేస్తూ , అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ ఫై అరుణ బాధపడుతుంది.

ఈ మేరకు ఆమె ఈ ట్రోల్స్ ఫై స్పందించారు. ‘దయచేసి జనసేన అభిమానులు.. అలాగే నా మీద అభిమానం చూపించే సోదరులెవరూ ఇప్పుడు జరుగుతున్న డిస్టర్బన్స్‌లో రిప్లైలు ఇవ్వొద్దు. పూర్తిగా వీడియో చూసిన వాళ్లెవరూ నన్ను తిట్టరు. కావాలని అన్నదమ్ములిద్దరి ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టి జనసేనకు నష్టం చేయాలనేది వైస్సార్సీపీ ప్లాన్’ అని రాయపాటి అరుణ (Rayapati Aruna) ట్వీట్ చేశారు. పిల్ల బిజ్జల ఏవో పిల్ల ఎడిట్‌లు చేసి చిరంజీవి ఫ్యాన్స్‌ను, కుల సంఘాలను నాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే కుట్ర చేస్తున్నాడంటూ ఆమె సెటైర్లు వేశారు.

మరో వీడియో పోస్ట్ చేసిన అరుణ..చిరంజీవి ఫై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ‘‘ఈ విషయంలో నన్ను సాక్ష్యత్తూ నా అన్నలు అనుకున్న పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి అడిగిన సరే ‘క్షమాపణలు’ చెప్పను. మీరు పబ్లిక్‌గా పోస్టులు వేశారు కాబట్టి వీడియో పబ్లిక్‌గా పోస్ట్ చేస్తున్నా. పెద్దలు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే ఈ వీడియో ఇక్కడ పోస్ట్ చేయడం వల్ల ఇందుకు క్షమించండి.’’ అని రాయపాటి అరుణ (Rayapati Aruna) ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ సొంత అన్నయ్య చిరంజీవిని తాను ఎందుకు తప్పుగా అంటానని ప్రశ్నించారు. మెగా ఫ్యామిలీని తాను ప్రొటక్ట్ చేసినట్లుగా ఇంకెవ్వరూ చేయట్లేదని అన్నారు. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత క్షమాపణలు మీరు చెప్తారో.. నేను చెప్పాలో తెలుస్తుందని చిరంజీవి అభిమానులను ఉద్దేశించి అన్నారు. ఇదంతా వైస్సార్సీపీ పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ అని.. ఈ ట్రాప్‌లో చిరంజీవి అభిమానులు పడ్డారని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటె నిన్నటికి నిన్న ఒంగోలు లో వైస్సార్సీపీ శ్రేణులు ఎన్టీఆర్ ప్లెక్సీ ఏర్పటు చేసి , టీడీపీ లో రచ్చ చేయాలనీ చూసారు. కానీ ఆ ప్లెక్సీ పెట్టింది ఎన్టీఆర్ అభిమానులు కాదని , వైస్సార్సీపీ శ్రేణులు అని తేలింది. ఇక ఇప్పుడు జనసేన పార్టీ లోని కీలక నేత ను ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు. మొత్తంగా టీడీపీ , జనసేన , బిజెపి పొత్తు ఖాయం కావడం తో ఇలా పార్టీల్లోని వ్యక్తులను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసారని అంత మాట్లాడుకుంటున్నారు.

Also Read Pawan & Modi : మోడీ పక్కన పవన్.. జనసేన కు రానున్నవన్నీ మంచి రోజులైనా..?