Site icon HashtagU Telugu

Chicken Quality : బర్డ్ ఫ్లూ భయాలు.. చికెన్ కొనేటప్పుడు ఇవి చెక్ చేయండి

Chicken Quality Chicken Parts Bird Flu

Chicken Quality : బర్డ్‌ ఫ్లూతో ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాలు అలర్ట్ మోడ్‌లో ఉన్నాయి. అక్కడి బర్డ్ ఫ్లూ కేసులు బయటపడిన ఇన్ఫెక్షన్ జోన్‌లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేసి ఉంచుతారు. ఇన్ఫెక్షన్ జోన్ నుంచి 1-10 కి.మీ. ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్‌గా (అలర్ట్ జోన్) ప్రకటించారు. హెచ్చరిక జోన్ (0-10 కి.మీ) లోపల, వెలుపల కోళ్లు, గుడ్ల రవాణాపై బ్యాన్ విధించారు. ఈనేపథ్యంలో తెలంగాణలోని గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ ప్లాజా వద్ద చెక్‌ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. కోళ్లు, బాతులతో వస్తున్న లారీలను వెనక్కి పంపుతున్నారు.

Also Read :YCP : వైసీపీకి కాస్త ఊపిరి పోసిన కీలక నేత

స్కిన్‌లెస్ చికెన్ ధర డౌన్ 

బర్డ్ ఫ్లూ భయాలతో చికెన్(Chicken Quality) కొనేందుకు జనం జంకుతున్నారు. కొందరు మాత్రం నిర్భయంగా చికెన్ కొని తింటున్నారు. కోడి గుడ్లు కూడా  తింటున్నారు. బర్డ్ ఫ్లూకు వ్యాక్సిన్ అవసరం లేదని ఫార్మా కంపెనీలు భావించాయి. అందుకే ఇప్పటిదాకా కోళ్లలో ఈ వ్యాధిని నిరోధించే టీకా రాలేదు.   బర్డ్ ఫ్లూ విషయంలో మనుషులకు ఆందోళనకర అక్కర్లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లోనైతే కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర  రూ.250 నుంచి రూ.300 దాకా ఉంటుంది. కానీ ఇప్పుడీ ధర రూ.100 దరిదాపుల్లో ఉంది. ఇలాంటప్పుడు చికెన్ కొనకుండా ఎవరు మాత్రం ఉండగలరు. చాలామంది మాంసాహార ప్రియులు భారీగానే చికెన్ కొనేస్తున్నారు.