Andhra: ఆంధ్ర ను చూసి ఈర్ష పడే రోజులు రాబోతున్నాయా..?

ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి సర్కార్..ఎన్నికలో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉంది

  • Written By:
  • Publish Date - July 1, 2024 / 02:39 PM IST

అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వరకు ఆంధ్ర ఎంతో అభివృద్ధిలో ఉండేది..పంట పొలాలల దగ్గరి నుండి ప్రతి ఒక్క దాంట్లో తెలంగాణ కంటే ముందుండేది. భూముల ధరలు , పంట పొలాలు , ఎలా ఏది చూసిన సరే ఆంధ్ర తర్వాతే ఏ రాష్ట్రమైన అని ఆంధ్రను చూసి ఈర్ష పడేవారు..కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత అంత మారిపోయింది. ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చిన మాజీ సీఎం కేసీఆర్..తెలంగాణ ను ఎంతగానో అభివృద్ధి చేసారు.

ఐదేళ్లలో ఎంతగానో అభివృద్ధి చేసి ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేసారు. ఆ తర్వాత మరోసారి అధికారం చేపట్టిన కేసీఆర్..ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసి ఎంతోమందికి భరోసా కల్పించారు. అనేక ప్రాజెక్ట్స్ కట్టి ఏడాదికి మూడు పంటలు తీసేవిధంగా నీరు అందించారు. మే నెలలో కూడా చెరువులన్నీ నిండుకుండలా ఉండేవి అంటే అర్ధం చేసుకోవాలి. ఇదో ఒక్కటే కాదు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అందరికి పెద్ద కుమారుడు అయ్యాడు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ కు రావాల్సిన వాటిఫై కేంద్రంతో పోరాటడం చేసి తెచ్చాడు. ఈరోజు తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగిదంటే కేసీఆర్ వల్లే అని ప్రతి ఒక్కరు చెపుతారు. అంతే కాదు ఆంధ్ర వారు సైతం తెలంగాణ అభివృద్ధి చూసి ఈర్ష పడ్డ రోజులు కూడా ఉన్నాయి. అలాంటి తెలంగాణ ఇప్పుడు మళ్లీ ఆంధ్ర ను చూసి ఈర్ష పడే రోజులు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుంటుంది. రోజు రోజుకు ప్రజల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయింది..నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది..పెన్షన్ దారులకు పెంచుతామని ఇచ్చిన పెన్షన్ ఇవ్వడం లేదు..ఇలా ఒక్కటి ఏంటి పూర్తి స్థాయిలో ఏ హామీ కూడా నెరవేర్చలేకపోయింది. అలాగే రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రావడం లేదు..ఆరేళ్లలో కాంగ్రెస్ సర్కార్ ఏంచేసిందనేది చెప్పడానికి ఏమిలేదు. ఇదే సందర్బంగా ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి సర్కార్..ఎన్నికలో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉంది. అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాలేదు..అప్పుడే పూర్తిస్థాయిలో ఇస్తామని పెన్షన్ ఇచ్చింది. గుంతల రోడ్లను సైతం బాగు చేయడం మొదలుపెట్టింది.

మొన్నటి వరకు రాష్ట్రానికి లేని రాజధానిని సైతం అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది. అనేక కంపెనీ లను రాష్ట్రానికి తీసుకొచ్చే పని మొదలుపెట్టింది. ఇలా అన్నింట్లో పరుగులు పెడుతుండడం తో తెలంగాణ ప్రజలు మళ్లీ ఆంధ్ర గురించి మాట్లాడుకోవడం..అక్కడ జరుగుతున్న పాలన గురించి చెప్పుకోవడం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా తెలంగాణ సీఎం రేవంత్..బిఆర్ఎస్ పార్టీ నేతలను చేర్చుకోవోడం మానేసి, ఇచ్చిన హామీల ఫై దృష్టి పెడితే బాగుండని సగటు తెలంగాణ పౌరుడు కోరుకుంటున్నాడు.

Read Also : Unemployed Protest : సీఎం రేవంత్ సొంత జిల్లాలో నిరుద్యోగుల నిరసన..