Chandrababu : సముద్రంలో కలిసే నీటిని వాడుకోవడంపై అనవసరంగా వివాదాలు సృష్టించడం ఎంతవరకు సమంజసం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ..గోదావరి నది నీటిని ఇరు రాష్ట్రాలు కూడా ఉపయోగిస్తున్నాయి. కానీ పోలవరం ప్రాజెక్టు తప్ప మిగతా ప్రాజెక్టులన్నీ కేంద్రం అనుమతి లేని ప్రాజెక్టులే. మనం మనం కలహపడితే చివరికి నష్టపోవేది ప్రజలే. తెలంగాణపై నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా విభేదించలేదు. ఈ విషయాల్లో స్పష్టత ఉండాలి అని తెలిపారు.
Read Also: Harish Rao : బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్.. రేవంత్ రెడ్డికి బేసిన్ల మీద లేదు..
కృష్ణా నదిలో నీటి కొరత ఉండటం వాస్తవమేనని సీఎం అన్నారు. కానీ ఇది పరస్పర ఆరోపణల ద్వారా పరిష్కారం కాదని, సమగ్ర చర్చల ద్వారానే ముందుకెళ్లాలని సూచించారు. కొత్త ట్రైబ్యునల్ ఏర్పడిన తరువాత అక్కడి నిర్ణయాలకు అనుగుణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ముందుకెళ్లాలి. ఎవరి శక్తికి తగినట్టు వారు ప్రాజెక్టులు నిర్మించుకోవాలి. పోరాటాల అవసరం లేదు అని వివరించారు. గోదావరిలో నీటికి కొదవలేదని, అందుకే అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వాడుకోవాలని సీఎం అభిప్రాయపడ్డారు. సముద్రంలో కలిసిపోయే నీటిని సద్వినియోగం చేసుకుంటే దానివల్ల ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. ప్రకృతివే ఇచ్చిన వనరులను మనమే కాపాడుకోవాలి అని చంద్రబాబు అన్నారు.
తాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎప్పుడూ వ్యతిరేకత చూపలేదని స్పష్టం చేశారు. అది వారి నాటకీయ అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుగా నేను భావిస్తున్నాను. అభివృద్ధి విషయంలో ఎవరినీ అడ్డుకోవాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. కానీ ప్రతి ప్రాజెక్టు కూడా న్యాయపరమైన అనుమతులతో, సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి అని చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి వనరులపై అవగాహనతో, చర్చలతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. ప్రజల భవిష్యత్తు కోసం సహకారంతో పనిచేయడం ముఖ్యం అని అన్నారు. ఒకటి కాదు రెండు రాష్ట్రాల భవిష్యత్తు ఈ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే చర్చలు, చిత్తశుద్ధి మరియు పరస్పర గౌరవంతో ముందుకు సాగాలి అని ఆయన అన్నారు.
Read Also: CM Chandrababu : రాష్ట్రవ్యాప్తంగా 1.30లక్షల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు: సీఎం చంద్రబాబు