Site icon HashtagU Telugu

Davos : పారిశ్రామిక దిగ్గజాలను ‘ఆహా’ అనిపిస్తున్న‘అరకు’ సువాసనలు

Araku Cofee

Araku Cofee

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన దావోస్ (Davos) నగరంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) సదస్సు అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి పారిశ్రామికవేత్తలు, పొలిటిషియన్లు భారీగా హాజరై, పెట్టుబడులకు గల అవకాశాలను అన్వేషిస్తున్నారు. అలాగే తమ ప్రాంతాలలో పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ దేశాలు, రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు ప్రత్యేకమైన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో దావోస్‌లోని ఏపీ పెవిలియన్ (Davos AP Pavilion) దగ్గర ప్రత్యేక ఆకర్షణగా అరకు కాఫీ(Araku coffee) నిలుస్తున్నది. విశాఖ జిల్లా మన్యంలో పండే ఈ అరకు కాఫీని ఏపీ పెవిలియన్‌లోని అతిథులకు అందిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరకు కాఫీ మెషీన్ ద్వారా కమ్మటి కాఫీ సువాసనలు పెవిలియన్‌ చుట్టూ పర్యటించే జనాలను ఆకర్షిస్తున్నాయి.

Champions Trophy Teaser: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీజ‌ర్ విడుద‌ల‌.. పాండ్యా ఎంట్రీ సూప‌ర్‌!

ఈ విషయాన్ని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్వయంగా వెల్లడించారు. ఏపీ పెవిలియన్‌లో ఏర్పాట్లను వివరిస్తూ.. అరకు కాఫీ మెషీన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అతిథుల మనసులను అరకు కాఫీ కొల్లగొడుతోందని పేర్కొంటూ దాని ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి అరకు కాఫీ గిఫ్ట్ ప్యాక్‌ను అందజేశారు. పెట్టుబడిదారులకు, ప్రముఖులకు కూడా ఇదే తరహా గిఫ్ట్ ప్యాకెట్లను అందించడం ద్వారా అరకు కాఫీ ప్రాధాన్యతను పెంచుతున్నారు. దావోస్‌లో ఏపీ అరకు కాఫీ సువాసనలు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా ప్రపంచం ముందుకు తీసుకొచ్చాయి. ఈ కాఫీ ప్రత్యేకతతో పాటు, పెట్టుబడులపై ఏపీ పెవిలియన్ అందిస్తున్న వివరాలు పెట్టుబడిదారులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.