Site icon HashtagU Telugu

Special Buses : సంక్రాంతికి స్పెషల్ బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ

APSRTC will run special buses for Sankranti

APSRTC will run special buses for Sankranti

Special Buses : సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్‌ఆర్టీసీ 7200 అదనపు బస్సులు నడపాలని నిర్ణయించింది. తెలంగాణ, ఇతర పొరుగు రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో స్పెషల్ బస్సులు నడపనున్నారు. సంక్రాంతి స్పెషల్ బస్సులు జనవరి 8 నుంచి 13వ తేదీవరకు అందుబాటులో ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ఇక పండుగ పూర్తి చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణానికి కూడా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది.

ఈ స్పెషల్ బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే సౌకర్యం ఉంటుందని తెలిపింది. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఒకేసారి రానుపోను టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ లభిస్తుందని వెల్లడించింది. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు 2,153 బస్సులు, బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు 375 బస్సులు, విజయవాడ నుంచి 300 అదనపు బస్సులు నడపనున్నారు. తిరుగు ప్రయాణానికి ఈ నెల 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులు నడపనున్నారు.

ఇక, సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని.. అదనపు ఛార్జీలు కూడా లేవని చెప్తున్నారు. ముందస్తు టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉన్నందున ప్రయాణికులు త్వరపడాలని సూచిస్తున్నారు. సంక్రాంతి సీజన్ వస్తోందంటే తెలుగు రాష్ట్రాల్లో హడావిడి మామూలుగా ఉండదు. ప్రయాణాలు ఊపందుకుంటాయి. ఇటు ఏపీ, అటు తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీలు వేల సంఖ్యలో అదనపు బస్సులు వేసినా, ప్రయాణికుల రద్దీ ఏమాత్రం తగ్గదు. ఈ నేపథ్యంలో, ఏపీఎస్ఆర్టీసీ ఈ సంక్రాంతికి బస్సుల సంఖ్యను మరింత పెంచింది.

Read Also: What is Bharatpol : ‘భారత్ పోల్’ విడుదల.. రాష్ట్రాల పోలీసు విభాగాలకు గుడ్ న్యూస్