Site icon HashtagU Telugu

APSRTC Special Buses : ద‌స‌రా ర‌ద్ధీ దృష్ట్యా ఆర్టీసీ స్పెష‌ల్ బ‌స్సులు.. వైజాగ్ నుంచి..?

Apsrtc Imresizer

Apsrtc Imresizer

దసరా పండుగ సీజన్ లో ప్ర‌తి ఏటా ఆర్టీసీ ప్ర‌త్యే బ‌స్సుల‌ను న‌డుపుతుంది. ఈ ఏడాది పండుగ ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం నుంచి వివిధ ప్రాంతాల‌కు ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సు స‌ర్వీసులు న‌డుపుతుంది. అక్టోబర్ 6 వరకు పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు ప్రకటించడంతో శనివారం నుంచి ద్వారకా బస్ స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దసరా రద్దీని క్లియర్ చేయడానికి, ఆర్టీసీ విశాఖపట్నం నుండి హైదరాబాద్, విజయవాడ, కాకినాడ మరియు రాజమండ్రి వంటి ప్రధాన ప్రాంతాలకు అక్టోబర్ 9 వరకు 520 ప్రత్యేక బస్సులను న‌డుపుతున్న‌ట్లు ప్ర‌క‌టిచింది. ఆర్టీసీ విశాఖపట్నం రీజినల్ మేనేజర్ అప్పల రాజు మాట్లాడుతూ ప్రస్తుతం విశాఖపట్నం-వివిధ ప్రాంతాల మధ్య అక్టోబర్ 4 వరకు 280 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.హైదరాబాద్‌కు 40, విజయవాడకు 70, రాజమండ్రికి 50, కాకినాడకు 20, శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పాతపట్నంకు 100 బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. దసరా తర్వాత అక్టోబరు 6 నుంచి 9 వరకు విశాఖపట్నం, ఇతర ప్రాంతాల మధ్య మరో 240 ప్రత్యేక బస్సులు నడపనుండగా.. ఇందులో హైదరాబాద్‌కు 20, విజయవాడకు 100, రాజమండ్రికి 50, కాకినాడకు 20, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు 50 ఉన్నాయి. దసరా సీజన్‌లో ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని ఆర్టీసీ ప్రకటించింది. డిమాండ్‌ను బట్టి అవసరమైతే అదనపు బస్సులను నడపడానికి సంస్థ సిద్ధంగా ఉంది.