APSRTC : అరుణాచ‌లంకు ప్ర‌త్యేక బ‌స్సు స‌ర్వీసు న‌డ‌ప‌నున్న ఏపీఎస్ఆర్టీసీ

నవంబర్ 25న గిరి ప్రదక్షిణ మహోత్సవం సందర్భంగా గుంటూరు నుంచి అరుణాచలం పుణ్యక్షేత్రానికి ఎపీఎస్ఆర్టీసీ ప్రత్యేక

  • Written By:
  • Publish Date - November 17, 2023 / 08:04 AM IST

నవంబర్ 25న గిరి ప్రదక్షిణ మహోత్సవం సందర్భంగా గుంటూరు నుంచి అరుణాచలం పుణ్యక్షేత్రానికి ఎపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసుల‌ను న‌డ‌పనుంది. పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షణ మహోత్సవం కోసం గుంటూరు 2 డిపో నుంచి ప్రత్యేక హైటెక్ బస్సును ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ గుంటూరు-2 డిపో మేనేజర్ అబ్దుల్ సలాం తెలిపారు. ఈ బస్సు నవంబర్ 25వ తేదీ రాత్రి 9:15 గంటలకు గుంటూరు బయలుదేరుతుంది. నవంబర్ 26న శ్రీ కాళహస్తి, కాణిపాకం మరియు శ్రీ పురం గోల్డెన్ టెంపుల్‌కు చేర‌కుంటుంది. అక్కడి నుంచి రాత్రికి బస్సు ప్రయాణించి నవంబర్ 27 పౌర్ణమి రోజు ఉదయం అరుణాచలం చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ బస్సు నవంబర్ 27 సాయంత్రం అరుణాచలం నుంచి గుంటూరుకు బయలుదేరి నవంబర్ 28 సాయంత్రం గుంటూరు చేరుకుంటుందని ఆర్టీసీ డిపో మేనేజ‌ర్ స‌లాం తెలిపారు. ఈ ప్రత్యేకమైన బస్సులో రిజర్వేషన్ సర్వీస్ ఉందని, కాబట్టి ప్రయాణికులు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్లు చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. ఒక్కో టిక్కెట్టు ధర రూ.2420 అని, అదనపు సమాచారం కోసం 7382897459, 7382894409, లేదా 7382896403 నంబర్లకు ఫోన్ చేయాలని, గుంటూరు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Also Read:  Voting Updates : మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో పోలింగ్ షురూ.. వివరాలివీ