APSRTC : ప్ర‌యాణికుల‌కు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్‌.. సంక్రాంతికి.. ?

ప్ర‌యాణికుల‌కు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌తి ఏడాది పండుగ‌ల స‌మ‌యంలో ఆర్టీసీ అద‌న‌పు ఛార్జీల‌ను వ‌సూళ్లు..

  • Written By:
  • Updated On - December 1, 2022 / 12:00 PM IST

ప్ర‌యాణికుల‌కు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌తి ఏడాది పండుగ‌ల స‌మ‌యంలో ఆర్టీసీ అద‌న‌పు ఛార్జీల‌ను వ‌సూళ్లు చేస్తుంది. అయితే ఈ విధ‌నానికి ఎపీఎస్ఆర్టీసీ స్వ‌స్తి చెప్పింది. గతంలోలా కాకుండా పండుగ సందర్భంగా సాధారణ ఛార్జీలపై 50 శాతం అదనంగా వసూలు చేయబోమని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణికుల కోసం సాధారణ ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తామ‌ని తెలిపారు. అప్ అండ్ డౌన్ ..రెండు ప్రయాణాలకు ముందుగానే తమ టిక్కెట్లను బుక్ చేసుకుంటే ఛార్జీలో 10 శాతం రాయితీ ఉంటుందని తెలిపారు. ప్ర‌తి ఏడాది ఆర్టీసీ అద‌న‌పు చార్జీల పేరుతో 50 శాతం వసూలు చేయడంపై ప్ర‌యాణికులు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అయితే ఈ సంక్రాందికి ఇప్పటికే apsrtconline.in వెబ్‌సైట్ ద్వారా సంక్రాంతి టిక్కెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌లు ప్రారంభమైనట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. జనవరి 7 నుండి ప్రత్యేక బస్సులను నడపడం ప్రారంభిస్తుందని.. ప్ర‌యాణికుల ర‌ద్దీ దృష్ట్యా జనవరి 20 వరకు ఈ సర్వీసులను కొనసాగిస్తామని ఆర్టీసీ తెలిపింది.