APSRTC : 263 బ‌స్సుల‌ను లీజుకు తీసుకోనున్న ఏపీఎస్ ఆర్టీసీ

ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బ‌స్సుల కోసం టెండ‌ర్ల‌ను ఆహ్వానించింది...

  • Written By:
  • Publish Date - September 23, 2022 / 11:11 AM IST

ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బ‌స్సుల కోసం టెండ‌ర్ల‌ను ఆహ్వానించింది. మరో 263 అద్దె బస్సుల‌ను తీసుకోవాల‌ని ఏపీఎస్ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాల వారీగా అవసరమైన అద్దె బస్సులకు టెండర్లు దాఖలు చేసేందుకు ప్రకటన విడుదలైంది. ప‌ది ఏసీ స్లీపర్, పన్నెండు సూపర్ లగ్జరీ, పదిహేను అల్ట్రా డీలక్స్, ముప్పై ఎక్స్‌ప్రెస్, తొంభై ఐదు అల్ట్రా పల్లె వెలుగు, డెబ్బై రెండు పల్లె వెలుగు, ఇరవై ఏడు మెట్రో ఎక్స్‌ప్రెస్, రెండు సిటీ ఆర్డినరీ బస్సులను లీజుకు తీసుకునేందుకు టెండర్లు ఆహ్వానించారు. అద్దె బస్సులను నడపడానికి ఆసక్తి ఉన్నవారు ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు టెండర్లు దాఖలు చేసి బిడ్లు వేయవచ్చు. అక్టోబరు 19న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ టెండర్లలో పాల్గొనేవారు MSTC “e” కామర్స్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. రూట్‌లు, టెండర్ షరతులు, బస్సుల స్పెసిఫికేషన్‌లు, టెండర్ షెడ్యూల్ మరియు టెండర్ నిబంధనల వివరాల కోసం APSRTC వెబ్‌సైట్ http://apsrtc.ap.gov.inని సంద‌ర్శించాల‌ని ఆర్టీసీ ఉన్న‌తాధికారులు తెలిపారు.