APSRTC : ద‌స‌రా సీజ‌న్‌లో ఏపీఎస్ ఆర్టీసీని ఆద‌రించిన ప్ర‌యాణికులు.. చార్జీలు పెంచ‌క‌పోవ‌డంతో..!

ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచకపోవడంతో దసరా సీజన్‌లో ఏపీఎస్‌ఆర్టీసీకి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది..

Published By: HashtagU Telugu Desk
Apsrtc Imresizer

Apsrtc Imresizer

ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచకపోవడంతో దసరా సీజన్‌లో ఏపీఎస్‌ఆర్టీసీకి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది. 80 శాతం ఆక్యుపెన్సీ రేటుతో 4,500 ప్రత్యేక సర్వీసుల్లో మొత్తం 1.84 లక్షల మంది ప్రయాణించి రూ.4.42 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి సరికొత్త రికార్డును నమోదు చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి సహాయపడుతుందని భావించిన ఆర్టీసీ దసరా సీజన్‌లో సాధారణ టిక్కెట్‌లపై 50 శాతం పెంచుతూ దశాబ్ద కాలంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తోంది. అయితే, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఉద్యోగుల జీతభత్యాలను ప్రభుత్వమే భరిస్తోంది. కరోనా ప్రభావంతో రెండేళ్లుగా సర్వీసులు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. తొలిసారిగా ఈ ఏడాది దసరా సీజన్‌లో అధిక చార్జీలు వసూలు చేయకూడదని ఆర్టీసీ నిర్ణయించి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం సాధారణ ఛార్జీలతో సెప్టెంబర్ 25 నుంచి దసరా వరకు 2,206 ప్రత్యేక సర్వీసులను నడపగా, ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది.

  Last Updated: 07 Oct 2022, 01:46 PM IST