మరో రెండు రోజుల్లో దసరా (Dasara) సంబరాలు మొదలుకాబోతున్నాయి. అక్టోబర్ 2 నుండి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. ఈ క్రమంలో ఇతర చోట్ల ఉన్న వారంతా సొంతర్లకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. పండగను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలో APSRTC ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది.
విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు వెళ్లే బస్సుల్లో టికెట్లపై 10 % రాయితీ ప్రకటించింది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని కూడా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి, వెన్నెల స్లీపర్ ఏసీ బస్సుల్లో ఈ రాయితీ వర్తిస్తుందని ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో ఎంజీబీఎస్‌కు ఆదివారం సాధారణ ఛార్జీ రూ. 770 ఉండగా, మిగిలిన రోజుల్లో 700 రూపాయలు, తదుపరి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆదివారం సాధారణ ఛార్జీ 830 రూపాయలు ఉండగా మిగిలిన రోజుల్లో రూ. 750గా నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్ టు విజయవాడ జర్నీ చేసేవారికి శుక్రవారం రోజు సాధారణ ఛార్జీ, మిగిలిన రోజుల్లో రాయితీ ఛార్జీ వసూలు చేస్తారు. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే వెన్నెల స్లీపర్ ఏసీ బస్సుల్లో ఆదివారం మెజిస్టెక్ బస్టేషన్ వరకు సాధారణ ఛార్జీ రూ. 2,170 ఉండగా, మిగిలిన రోజుల్లో 1970, ఆపై ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆదివారం రూ. 2210, మిగిలిన రోజుల్లో రూ. 2010 ఉంటుంది.
అమరావతి మల్టీ యాక్సిల్ బస్సుల్లో ఆదివారం మెజిస్టిక్ బస్టేషన్ వరకు సాధారణ ఛార్జీ రూ.1870, మిగిలిన రోజుల్లో రూ.1700, ఆపై ప్రాంతాలకు ఆదివారం సాధారణ ఛార్జీ 1930, మిగిలిన రోజుల్లో రూ. 1750 గా రాయితీ కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
ఇటు TGRTC సైతం దసరా సందర్బంగా ప్రత్యేక బస్సులు , రాయితీలు ఏర్పాటు చేస్తుంది. ఏపీలో కంటే తెలంగాణ లో దసరా పండగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు కాబట్టి ప్రయాణికులు భారీ సంఖ్యలో ప్రయాణాలు చేస్తారు. ఇందుకు తగ్గట్లు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఉండడం తో ఈసారి ప్రయాణికులు గతంలో కంటే ఎక్కువగా ఉంటారని తెలుస్తుంది.
Read Also : Chandrababu : ఈ వయసులో చంద్రబాబు రాజకీయాలు ఎందుకు.. ? మాజీ మంత్రి పేర్ని నాని