Site icon HashtagU Telugu

Breaking : ఏపీ ప్రయాణీలకు షాక్…శుక్రవారం నుంచి బస్సు ఛార్జీల పెంపు

Apsrtc Buses

Apsrtc Buses

ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు షాకిచ్చింది APSTRC.రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల ఛార్జీలు పెంపునకు రెడీ అయ్యింది. శుక్రవారం నుంచి బస్సు ఛార్జీలు పెంచాలని కీలక నిర్ణయం తీసుకుంది. డీజీల్ సెస్ పంపు వల్ల ఛార్జీలు పెంచక తప్పలేదని చెబుతున్నారు అధికారులు. అయితే డీజీల్ సెస్ పెంపు కారణంగా ఇప్పటికీ తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు సైతం పెరిగాయి. దీంతో హైదరాబాద్ కు వచ్చే ప్రయాణికులు ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ సంస్థలకు టీఎస్ ఆర్టీసీ సర్క్యూలర్ జారీ చేసింది. అంతర్రాష్ట్ర రవాణ సంస్థల ఒప్పందం ప్రకారం…ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే బస్సులు ఛార్జీలు ఒకేలా ఉండాలనే నిబంధన ఉందని TSRTC అధికారులు తెలిపారు.