Ippatam Issue: కొట్టినా జ‌గ‌న‌న్నే, కూల్చినా జ‌గ‌న‌న్నే.!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్ర‌భుత్వ‌మా? మ‌జాకానా? ఇళ్లు కూల్చిన‌ప్ప‌టికీ ఇప్ప‌డం ప్ర‌జ‌లు నీరాజ‌నాలు పలుకుతూ ఫ్లెక్సీల‌ను ప్ర‌ద‌ర్శించడం విచిత్రం. ఆ గ్రామ ప్ర‌జ‌లు జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌కు భూములు ఇచ్చార‌ని ఇళ్ల‌ను కూల్చారంటూ ప‌వన్ వెళ్లి హ‌డావుడి చేశారు.

  • Written By:
  • Updated On - November 11, 2022 / 11:40 AM IST

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్ర‌భుత్వ‌మా? మ‌జాకానా? ఇళ్లు కూల్చిన‌ప్ప‌టికీ ఇప్ప‌డం ప్ర‌జ‌లు నీరాజ‌నాలు పలుకుతూ ఫ్లెక్సీల‌ను ప్ర‌ద‌ర్శించడం విచిత్రం. ఆ గ్రామ ప్ర‌జ‌లు జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌కు భూములు ఇచ్చార‌ని ఇళ్ల‌ను కూల్చారంటూ ప‌వన్ వెళ్లి హ‌డావుడి చేశారు. న‌ష్ట‌ప‌రిహారం కింద ల‌క్ష ఇస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. మ‌రుస‌టి రోజు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ ఆ గ్రామానికి వెళ్లారు. ఏపీలో రాక్ష‌స పాల‌న సాగుతోంద‌ని, అరాచ‌కం జ‌రుగుతుంద‌ని ఆరోపిస్తూ బాధితుల‌కు మ‌ద్ధ‌తు ప‌లికారు. సీన్ క‌ట్ చేస్తే, మాకు ఎవ‌రి సానుభూతి వ‌ద్దంటూ జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల‌ను కూల్చ‌డం త‌ప్పేమీకాద‌ని `ఇప్ప‌టం` గ్రామ ప్ర‌జ‌లు ఫ్లెక్సీలు వేయ‌డం గ‌మ‌నార్హం.

కోవిడ్ సంద‌ర్భంగా మాస్క్ అడిగినందుకు విశాఖ‌లోని డాక్ట‌ర్ సుధాక‌ర్ ను ఏపీ పోలీసులు రెక్క‌లు విరిచివెన‌క్కు క‌ట్టారు. రోడ్డు మీద ప‌డేసి దాడి చేశారు. ఆయ‌న‌కు పిచ్చిప‌ట్టింద‌ని ముద్ర వేశారు. కొన్ని రోజుల‌కు ఆయ‌న కుటుంబ స‌భ్యులు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం చేసింది క‌రెక్టేనంటూ మీడియా ముందుకొచ్చారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి అనుచ‌రులు ఇంటిలోకి జొర‌బ‌డి వైశ్య సామాజిక‌వ‌ర్గానికి చెందిన సుబ్బారావును చిత‌క‌బాదారు. ప్రాణ‌భ‌యంతో ప్రాధేయ‌ప‌డ్డ ఆయ‌న‌కు ఫైన‌ల్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. మ‌రుస‌టి రోజు దెబ్బ‌లు తిన్న అదే సుబ్బారావు మీడియా ముందుకొచ్చి విచిత్రంగా వాస‌న్న అంటే ప్రాణం అంటూ చెప్పుకొచ్చారు. ఇంటిలోకి దాడి చేయ‌డానికి రాలేద‌ని అప్ప‌టి వ‌ర‌కు వైర‌ల్ అయిన వీడియోను బాధితుడే తూచ్ అన్నాడు.తిరుప‌తికి వెళుతోన్న భ‌క్తుల నుంచి జ‌గ‌న్ కాన్వాయ్ కు కారు కావాల‌ని లాక్కున్నారు. బాధితులు మాత్రం అలాంటిది ఏమీ లేద‌ని త‌మ ఇష్ట ప్ర‌కార‌మే కారు ఇచ్చామ‌ని చెప్ప‌డానికి ముందుకొచ్చారు.

Also Read:  Kadapa University: జ‌గ‌న్ వింత పోక‌డ‌, `యోగి వేమ‌న‌`కు అవ‌మానం!

వైసీపీ క్యాడ‌ర్ పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ పై దాడి చేసిన సంఘ‌ట‌న చూశాం. ఆ సంద‌ర్భంగా పోలీసు అధికారి త‌ల‌కు బ‌ల‌మైన గాయం అయింది. ఆస్ప‌త్రికి వెళ్లి కుట్లు వేయించుకున్న‌ పోలీసు అధికారి విచిత్రంగా తానే కింద‌ప‌డితే దెబ్బ తగిలింద‌ని చెప్పుకొచ్చారు. అదే అధికారి వైసీపీ క్యాడ‌ర్ మ‌సాజ్ చేసే ప్ర‌య‌త్నం చేశార‌ని చెప్ప‌డాన్ని విన్నాం. ఇలాంటి సంఘ‌ట‌న‌లు మూడేన్న‌రేళ్ల కాలంలో అనేకం ఉన్నాయి. వైసీపీ క్యాడ‌ర్ తో కావాల‌ని తామే కొట్టించుకున్నాం అని చెప్పేంత‌గా జ‌గ‌న‌న్న మీద అభిమానం ఏపీ ప్ర‌జ‌ల‌కు పొంగిపోతోంది. ఆ కోవ‌లోకి ఇప్పుడు `ఇప్ప‌టం` గ్రామ ప్ర‌జ‌ల ప‌రిస్థితి వ‌చ్చింది. ఇళ్ల‌ను కూల్చి వేసిన‌ప్ప‌టికీ ప‌ర్వాలేదు. మా జ‌గ‌న‌న్న మంచి చేస్తున్నాడ‌ని ఫ్లెక్సీలు పెట్టారు. విప‌క్ష నేత‌లు వెళ్లి చేసిన ప‌రామ‌ర్శ‌ను త‌ప్పుబ‌ట్టారు. మీ సానుభూతి మాకు అవ‌స‌రంలేద‌ని ప్లెక్సీల‌తో తేల్చాశారు. ఇదండీ ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాజ‌కీయం.

బ‌హుశా ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా లేని విధంగా ఏపీలోని జ‌గ‌న్మోహన్ రెడ్డి ప్ర‌భుత్వానికి మ‌ద్ధ‌తు ఇస్తున్న జ‌నం లేర‌నుకుంటా. దాడులు చేసినా, సొంత ఆస్తుల‌ను కూల్చివేసినా, ఇంట్లోకి జొర‌బ‌డి గాయ‌ప‌రిచినా, మా జ‌గ‌న‌న్న మా జ‌గ‌న‌న్నే అనేలా ఏపీ ప్ర‌జ‌లు ఉన్నారంటే అభిమానమా లేక భ‌య‌మా? అనేది మీరే తేల్చాలి.

Also Read:   Gnaneswar Swearing: తొలిరోజే `జ్ఞానేశ్వ‌ర్` స్వ‌రాలు తారుమారు