Site icon HashtagU Telugu

Group 1 Alert : గ్రూప్‌-1 మార్కుల మెమోలు డౌన్‌లోడ్ చేసుకోండి

APPSC Group-1 Prelims 2024

Appsc Group 1 Recruitment 2

Group 1 Alert : ఏపీలో గ్రూప్-1 పరీక్ష రాసిన అభ్యర్థులు తమ మార్కుల మెమోలను ఇక ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ లింక్‌ను క్లిక్ చేస్తే నేరుగా ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లోకి మీరు రీడైరెక్ట్ అవుతారు.  అభ్యర్థులు వన్‌టైం ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీపీఆర్‌) ఆధారంగా మార్కుల మెమొరాండంలోని వివరాలను తెలుసుకోవచ్చని ఏపీపీఎస్సీ శనివారం తెలిపింది.  కొత్త పద్ధతి ప్రకారం మార్కుల మెమోల కోసం ఇక అభ్యర్థులెవరూ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ విధానంలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల వివరాలు అందరికీ తెలిసే అవకాశం ఉండదని పేర్కొంది. గ్రూప్‌-1(Group 1 Alert) మార్కుల వెల్లడి విధానంలో ఇటీవల ఏపీపీఎస్సీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join

2022 గ్రూప్-1 నోటిఫికేషన్‌లో ఎంపిక జాబితా వెల్లడి జరిగిన నెల తర్వాత.. కోరినవారికి మార్కుల మెమొరాండం అందిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. కానీ ఆ అంశాన్ని అమలు చేయలేదు. మార్కులు వెల్లడించకపోవడంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఏపీపీఎస్సీ గుట్టుచప్పుడు కాకుండా మార్చి 19న తమ  వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. మార్కుల మెమొరాండం అవసరమైనవారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేస్తే, రెండు వారాల తర్వాత వారికి వచ్చిన మార్కులను లాగిన్ విధానంలో తెలుసుకునే అవకాశం కల్పిస్తామని  వెల్లడించింది.అందులో భాగంగానే ఇప్పుడు మార్కుల మెమోలను విడుదల చేసింది.

Also Read :150 Killed : మాస్కోలో ఉగ్రదాడి.. 150కి చేరిన మృతులు.. 11 మంది అరెస్ట్

గ్రూప్-1 పరీక్షకు సంబంధించిన మార్కుల వెల్లడిపై గతంలో ఏపీపీఎస్సీ ఆంక్షలు పెట్టడం చర్చనీయాంశమైంది. 2018 గ్రూప్-1 నోటిఫికేషన్‌లోనే ప్రిలిమ్స్ ప్రాథమిక కీ వెల్లడి అనంతరం అభ్యర్థులకు వచ్చిన మార్కులతో కూడిన మొత్తం జాబితాను ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. ప్రత్యేకంగా మెమొరాండం ఉండదని  పేర్కొంది. కానీ ఈ నోటిఫికేషన్ ద్వారా నియామకాల్లో ఎంపికైన, మౌఖిక పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు వచ్చిన మార్కుల వివరాలు ఇంతవరకు చెప్పలేదు. సమాచార హక్కు చట్టం కింద అడిగినవారికి కోర్టు కేసు ఉందని కమిషన్ సమాధానమిస్తోంది. యూపీఎస్సీ పరీక్షల్లో కమ్యూనిటీ, సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులను వెల్లడిస్తున్నారు. ఏపీపీఎస్సీ కూడా 2016 నోటిఫికేషన్ వరకు ఇదే సంప్రదాయాన్ని కొనసాగించింది. 2018లో గ్రూప్-1 నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటి నుంచే కోర్టు విచారణను అడ్డం పెట్టుకుని ఏపీపీఎస్సీ మార్కుల వెల్లడి సంప్రదాయాన్ని పక్కన పెట్టింది.

Also Read :Ineligible Candidates : పోటీకి అనర్హుల జాబితా ప్రకటించిన ఈసీ.. ఎవరంటే ?