APPSC : గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల

APPSC : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు మే 3న ప్రారంభమై మే 9వ తేదీ వరకు జరుగుతాయి.

Published By: HashtagU Telugu Desk
Mains Exam Schedule 2025

Mains Exam Schedule 2025

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ (Group 1 Mains Exam)ను ఖరారు చేసింది. వచ్చే మే నెలలో ఈ పరీక్షలు నిర్వహించబడతాయని అధికారికంగా ప్రకటించింది. అభ్యర్థుల సౌలభ్యం కోసం అన్ని వివరాలను ముందుగానే వెల్లడిస్తూ, పరీక్ష తేదీలు, సమయాలు, సబ్జెక్టుల వివరాలను విడుదల చేసింది.

Harish Rao : మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా..?

పరీక్షల తేదీల వివరాలు :

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు మే 3న ప్రారంభమై మే 9వ తేదీ వరకు జరుగుతాయి.
మే 3న తెలుగు పరీక్ష
మే 4న ఇంగ్లిష్ పరీక్ష
మే 5న జనరల్ ఎస్సే
మే 6న హిస్టరీ కల్చరల్
మే 7న పాలిటీ, లా
మే 8న ఎకానమీ
మే 9న సైన్స్, టెక్నాలజీ పేపర్ పరీక్షలు జరుగుతాయి.

ఈ అన్ని పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయని APPSC పేర్కొంది. అభ్యర్థులు ఈ షెడ్యూల్‌ను గమనించాలని, పరీక్ష సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రానికి
చేరుకోవాలని సూచించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్, అవసరమైన గుర్తింపు పత్రాలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే, పరీక్ష కేంద్రాల్లో ఆచరించాల్సిన నియమాలను పాటించాలని సూచించింది. అభ్యర్థులు ముందుగానే సిలబస్‌కు అనుగుణంగా సిద్ధమవ్వాలని అధికారులు పేర్కొన్నారు.

  Last Updated: 21 Jan 2025, 06:31 PM IST