Site icon HashtagU Telugu

Group 2 Prelims : గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ ఫలితాలు ఎప్పుడంటే..

APPSC Group-1 Prelims 2024

Appsc Group 1 Recruitment 2

Group 2 Prelims : ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 4,04,037 మంది గ్రూప్‌-2 ప్రిలిమ్స్ పరీక్ష రాశారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు మరో వారం రోజుల్లోగా రిలీజ్ కానున్నాయి. ఈవిషయాన్ని ఏపీపీఎస్సీ స‌భ్యుడు ప‌రిగె సుధీర్ ట్విట్టర్ (ఎక్స్‌) వేదిక‌గా వెల్లడించారు. గ్రూప్-2 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించే అభ్యర్థులను 1:100 నిష్పత్తి ప్రకారం మెయిన్స్ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తామన్నారు. ప్రిలిమ్స్(Group 2 Prelims) జనరల్ కేటగిరి కటాఫ్ 50 నుంచి 60 మార్కుల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను జూన్/జులైలో నిర్వహించే అవకాశం ఉంది. మెయిన్స్ లో రెండు పేపర్లను 300 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో చూస్తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉన్నాయి. ఇక పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయించారు. మెయిన్స్‌లో కనబర్చే ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ పరీక్ష (సీపీటీ) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తారు. 899 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ డిసెంబరు 7న గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-2 ఖాళీల్లో 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్ , 566 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 25న  గ్రూప్‌-2 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది.

Also Read :Summer Holidays : విద్యార్థులకు ఈసారి భారీగా సమ్మర్ హాలిడేస్.. ఎన్నో తెలుసా ?

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ కీ

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్-1, పేపర్-2  ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ ఇప్పటికే విడుదల చేసింది. వీటిని  అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రాథమిక కీపై అభ్యర్థులకు సందేహాలుంటే నిర్ణీత ఫార్మాట్‌లో ఆన్‌లైన్ ద్వారా మార్చి 21లోగా  నమోదు చేసుకోవచ్చు. మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. పేపర్-1 పరీక్షకు 91,463 (72.55 %) మంది, పేపర్-2 పరీక్షకు 90,777 (72 %) మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Also Read :Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీడియా సంస్థ అధినేత, ఓ కీలక నేత!

Exit mobile version