Dasari Kiran Kumar: టీటీడీ బోర్డు సభ్యుడిగా దాసరి కిరణ్ కుమార్ నియామకం

టీటీడీ బోర్డు మెంబర్ గా (Dasari Kiran Kumar) దాసరి కిరణ్ కుమార్ ను సీఎం జగన్ అపాయింట్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Dasari

Dasari

టీటీడీ (TTD) సభ్యుడిగా నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ (Dasari Kiran Kumar) ను ఏపీ సీఎం జగన్ నామినేట్ చేశారు. ప్రతిష్ఠాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు కొత్త సభ్యుడిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. AP ప్రభుత్వం అన్ని విభాగాలు, రాష్ట్రాలకు ప్రాధాన్యతనిస్తూ బోర్డును జాగ్రత్తగా ఏర్పాటు చేసింది. టీటీడీ బోర్డుకు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంది. 24 మంది సభ్యుల బోర్డు సభ్యుల్లో ఒకరిగా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ (Dasari Kiran Kumar) నియమితులయ్యారు.

చాలా మంది బోర్డులో స్థానం సంపాదించడం తమ జీవితకాల ఆశయంగా తీసుకుంటారు. కానీ చాలా కొద్దిమందికి ప్రతిష్టాత్మకమైన అవకాశం లభిస్తుంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి దాసరి కిరణ్‌ సన్నిహితుడు. అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan)కి, ఎంపీకి దాసరి కిరణ్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నేను జగన్‌కి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వీరాభిమానిని. ఈ నియామకంతో విధేయుడికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని మరోసారి నిరూపించుకున్నాడు (Dasari Kiran Kumar) దాసరి కిరణ్‌కుమార్‌.

Also Read: Janhvi On Board: క్రేజీ అప్డేట్.. ఎన్టీఆర్ పక్కన జాన్వీ ఫిక్స్!

  Last Updated: 16 Dec 2022, 04:32 PM IST